Best Selling Cars: కొన్నేళ్లుగా భారతదేశ ప్రజలు ఎస్ యూవీ కార్లను కొనుగొలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో అనూహ్యంగా ఈ కార్ల విక్రయాలు భారీగా పెరిగాయి. ఇది కాంపాక్ట్ ఎస్యువి సెగ్మెంట్లో అత్యంత వేగవంతమైన వృద్ధిని సాధించేందుకు సహాయపడుతోంది. గత నెలలో కూడా ఎస్యు వీల విభాగంలో భారీగా విక్రయాలు జరిగాయి. గత నెలలో అత్యధికంగా అమ్ముడైన ఎస్ యూవీల జాబితాను పరిశీలిస్తే ఆ విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది
టాప్ లెవెల్ అమ్మకాల్లో టాటా నెక్సాన్..
ప్రస్తుతం దేశంలో అత్యధికంగా అమ్ముడు అవుతున్న కార్లలో టాటా నెక్సాన్ ముందు వరుసలో ఉంది. ఈ ఏడాది మే నెలలో మొత్తంగా 14,423 యూనిట్ల కార్లు అమ్ముడు అయ్యాయి. ఇది గత ఏడాది మే నెలతో పోలిస్తే ఒక శాతం తక్కువగా ఉంది. 2022 మే నెలలో టాటా నెక్సాన్ 14,614 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఈ కారు ఎక్స్ షోరూం ధర రూ.7.80 లక్షల నుంచి రూ.14.50 లక్షల మధ్యలో ఉంది. ఇది పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రికల్, పవర్ ట్రైన్ ఆప్షన్ లో అందుబాటులో ఉంది.
మారుతీ సుజుకి బ్రెజా..
గత ఏడాది విడుదల చేసిన కొత్త తరం మారుతి బ్రెజా గత నెలలో 13,398 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఈ కారు ఎక్స్ షోరూం ధర రూ.8.29 లక్షల నుంచి రూ.14.14 లక్షల మధ్యలో ఉంది. దీని విక్రయాలు టాటా నెక్సాన్ కు చాలా దగ్గరగా ఉన్నాయి.
టాటా పంచ్..
ఈ ఏడాది మే నెలలో ఎక్కువగా విక్రయమైన కార్లలో టాటా పంచ్ కూడా టాప్ లో ఉంది. ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ తో టాటా నుంచి వచ్చిన ఈ మైక్రో ఎస్ యూవీ అమ్మకాల పరంగా కూడా చాలా ముందుంది. అది మే నెలలో ఈ కారుకు సంబంధించి 11,124 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది గత ఏడాది మే కంటే తొమ్మిది శాతం ఎక్కువ. టాటా పంచ్ ఎక్స్ షోరూం ధర రూ.6 లక్షల నుంచి రూ.9.52 లక్షల మధ్యలో ఉంది.
హ్యుందాయ్ వెన్యూ..
అలాగే ఈ ఏడాది మే నెలలో హ్యుందాయ్ వెన్యూ విక్రయాలు కూడా భారీగానే జరిగాయి. 23% అధికంగా విక్రయాలు జరిగినట్లు చెబుతున్నారు. ఈ ఏడాది మే నెలలో వీటి విక్రయాలు 10,213 యూనిట్లకు చేరుకున్నాయి. తేడాది మే నెలలో హ్యుందాయ్ వెన్యూ 8,300 యూనిట్లు మాత్రమే విక్రయించారు. కంపెనీ గతేడాది దీన్ని అప్డేట్ చేసింది. హ్యుందాయ్ వెన్యూ ఎక్స్ షో రూమ్ ధర రూ.7.72 లక్షల నుంచి రూ.13.18 లక్షల మధ్యలో ఉంది.
మారుతి సుజుకి ఫ్రాంక్స్..
మారుతి సుజుకి ఫ్రాంక్స్ కూడా ఈ ఏడాది భారీగా అమ్ముడయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ లో ఈ కారును విడుదల చేసింది. ఈ ఏడాది మే నెలలో ఈ కారుకు సంబంధించి 9,863 యూనిట్లు అమ్ముడయ్యాయి. దీని ఎక్స్ షోరూం ధర రూ.7.46 లక్షల నుంచి రూ.13.13 లక్షల మధ్యలో ఉంది.
ప్రతినెల భారీగా పెరుగుతున్న కార్ల విక్రయాలు..
ఇక భారతదేశంలో గత కొన్నేళ్ల నుంచి కార్ల విక్రయాలు ప్రతినెల భారీగా పెరుగుతున్నాయి. కొత్త కారు కొనుగోలుపై ఎక్స్ షోరూం ధరతో పాటు వినియోగదారులు చాలా పన్నులు, ఇతర చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. కొత్త కారును కొనుగోలు చేయబోతున్నట్లయితే కొంత డబ్బు ఆదా చేసుకోవడానికి అవసరమైన కొన్ని చిట్కాలను కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. కార్ల తయారీదారులు తమ అనేక మోడల్ పై తరచుగా వివిధ రకాల ఆఫర్లను అందిస్తారు. వీటిని డీలర్ షిప్ లో కస్టమర్లకు ఎక్కువగా వెల్లడించారు. అటువంటి పరిస్థితుల్లో వాహనం కొనుగోలు చేయడానికి ముందు కంపెనీ అధికారిక వెబ్సైట్ను సందర్శించి ఇష్టమైన కారుపై అందుబాటులో ఉన్న డిస్కౌంట్ ఆఫర్ను చెక్ చేసుకోవడం ద్వారా కొంత తక్కువ మొత్తానికి కారును కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది.
Web Title: List of top 10 selling cars and suvs in may 2023
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com