
దేశీ దిగ్గజ బీమా రంగ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్‌ఐసీ పాలసీ తీసుకోవాలని భావించే వాళ్ల కొరకు ఎప్పటికప్పుడు కొత్త పాలసీలను అందుబాటులోకి తెస్తోంది. ఎల్‌ఐసీ తెచ్చే పాలసీలలో పిల్లల కోసం కూడా కొన్ని పాలసీలు ఉన్నాయి. పిల్లల భవిష్యత్తు కోసం, ఆర్థిక భద్రత కోసం ఈ పాలసీలను తీసుకుంటే మంచిది. పాలసీ గడువు ముగిసిన తర్వాత చేతికి డబ్బులు రావడంతో పాటు ఈ పాలసీల వల్ల ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా లభిస్తుంది.
న్యూ చిల్ట్రన్స్ మనీ బ్యాక్ ప్లాన్ పేరుతో ఎల్‌ఐసీ పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక పాలసీని అమలు చేస్తోంది. కనీసం 10వేల రూపాయల బీమా మొత్తానికి ఈ పాలసీని తీసుకునే అవకాశాలు ఉంటాయి. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు కాబట్టి ఎన్ని సంవత్సరాలకైనా ఈ పాలసీని తీసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. న్యూ చిల్డ్రన్స్ మనీ బ్యాక్ ప్లాన్ టర్మ్ 25 సంవత్సరాలుగా ఉంటుంది.
ఎవరైతే ఈ పాలసీని తీసుకుంటారో వాళ్లు పిల్లలకు 18 ఏళ్లు వచ్చినప్పుడు 20 శాతం, 20 ఏళ్లు వచ్చినప్పుడు మరో 20 శాతం, 22 ఏళ్లు వచ్చినప్పుడు మరో 20 శాతం డబ్బులు పొందే అవకాశం ఉంటుంది. మిగతా 40 శాతం డబ్బులను పాలసీ గడువు ముగిసిన తర్వాత తీసుకోవాల్సి ఉంటుందని చెప్పవచ్చు. నెలకు రూ.4600 ప్రీమియంతో ఐదేళ్ల వయస్సులో పిల్లల పేరుపై పాలసీ తీసుకుంటే మంచిది.
రోజుకు దాదాపు రూ.150 పొదుపు చేస్తే 10 లక్షల రూపాయల బీమా మొత్తానికి ప్రీమియం చెల్లించే అవకాశాలు అయితే ఉంటాయి. పాలసీ మెచ్యూరిటీ సమయంలో ఏకంగా 19 లక్షల రూపాయలు పొందవచ్చు.