JIO Rs. 198 Plan : ప్రముఖ టెలికాం సంస్థలు జియో, ఐడియా, ఎయిర్ టెల్ రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచిన సంగతి తెలిసిందే. అయితే దేశంలోని యూజర్లందరూ తమ సిమ్ ను బిఎస్ఎన్ఎల్ కు పోర్ట్ చేసుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం ఈ బిఎస్ఎన్ఎల్ సరసమైన, చౌకైన రీఛార్జ్ ప్లాన్ లను అందించడంతో యూజర్లందరూ దానికి పోర్టు అవుతున్నారు. ఈ నేపథ్యంలో జియో కస్టమర్లను ఆకర్షించేందుకు సరితో సరసమైన, చౌకైన ప్లాన్స్ ని తీసుకువస్తోంది. అదే రూ. 198 రీఛార్జ్ ప్లాన్. ఏది రూ. 200 కంటే తక్కువ ధరలో ఉండడం విశేషం. ఇందులో రోజువారీగా 2GB డేటా వస్తుంది. అంతేకాకుండా అపరిమిత 5జీని కూడా అందిస్తుంది. ఇప్పుడు ఈ ప్లాన్ వివరాలు చూద్దాం.
జియో రూ. 198 ప్రీపెయిడ్ ప్లాన్
రిలయన్స్ జియో రూ.198 ప్రీపెయిడ్ ప్లాన్ 14రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్ పొందొచ్చు. అంతేకాకుండా రోజుకు 100ఎస్ఎంఎస్ సదుపాయం కూడా పొందొచ్చు. ఇకపోతే రోజుకు 2జీబీ అందిస్తుంది. అయితే, ఈ ప్లాన్ 5జీ ప్రయోజనాలతో కూడా వస్తుంది. ఈ ప్లాన్ లో అదనపు ప్రయోజనాలు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ సేవలు వస్తాయి. అయితే, రిలయన్స్ జియో 2జీబీ రోజువారీ డేటా లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌లతో మాత్రమే అపరిమిత 5జీని అందిస్తుంది. కావున ఇది జియో కస్టమర్లకు అందుబాటులో ఉన్న యాక్టివ్ సర్వీస్ చెల్లుబాటుతో చౌకైన అపరిమిత 5G ప్లాన్ అని చెప్పవచ్చు.
ఎయిర్ టెల్ 379 ప్లాన్ వివరాలు
రోజువారీ 2జీబీ డేటాతో ఎయిర్ టెల్ చౌకైన ప్లాన్ రూ. 379, ఈ ప్లాన్‌తో రోజువారీ 2జీబీ డేటాతో పాటు, ఉచిత కాలింగ్, రోజుకు 100ఎస్ఎంఎస్ లు అందించబడతాయి. ఒక నెల వాలిడిటీతో ఈ ప్లాన్‌ని పొందుతారు. అదనపు ప్రయోజనాల గురించి మాట్లాడుతూ, ఈ ప్లాన్ అపరిమిత 5జీ డేటా, స్పామ్ అలర్ట్, మూడు నెలల పాటు అపోలో సర్కిల్ మెంబర్‌షిప్, ఉచిత హెలోట్యూన్ ప్రయోజనంతో వస్తుంది.
వీఐ 365 ప్లాన్ వివరాలు
వొడా ఫోన్ ఐడియా 2 జీబీ రోజువారీ డేటాతో అనేక ప్లాన్‌లను కలిగి ఉంది, అయితే చౌకైన ప్లాన్ ధర రూ. 365. ఈ ప్లాన్ రూ. 365తో రోజుకు 2 జీబీ డేటా, రోజుకు 100ఎస్ఎంఎస్, ఉచిత కాలింగ్ ప్రయోజనాన్ని అందిస్తుంది. 28 రోజుల వ్యాలిడిటీతో కూడిన ఈ ప్లాన్‌తో అర్ధరాత్రి 12 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు హాఫ్ డే అపరిమిత డేటా, వారాంతపు డేటా రోల్‌ఓవర్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.