India UK FTA Deal: భారత్, బ్రిటన్ మధ్య జరిగిన చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) ద్వారా టాటా మోటర్స్ భారీగా లాభాలు గడించేందుకు పాపులు కదుపుతోంది. అంతేకాకుండా, టాటా గ్రూప్‌లోని రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి టీవీఎస్ మోటర్స్ వరకు అనేక ఇతర కంపెనీలు కూడా ఈ ఒప్పందం ద్వారా ఎంతో ప్రయోజనం పొందనున్నాయి. భారత్-బ్రిటన్ FTA ఒప్పందం తర్వాత, భారతదేశం నుంచి బ్రిటన్‌కు వెళ్లే దాదాపు 99 శాతం వస్తువులు పన్ను రహితం కానున్నాయి. అదేసమయంలో ఆటో రంగంలో బ్రిటన్‌కు కూడా పెద్ద ప్రయోజనం లభించింది. ఇకపై బ్రిటన్ నుంచి భారతదేశానికి వచ్చే కార్లపై 110 శాతం కాదు. కేవలం 10 శాతం మాత్రమే పన్ను ఉంటుంది. అయితే, కంపెనీలకు ఒక పరిమిత కోటాలో మాత్రమే ఈ కార్లను దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. ఈ ఒక్క నియమం టాటా మోటర్స్ భవితవ్యాన్ని మార్చబోతుంది.
Also Read: మీ వల్లే మేమిలా.. సైన్యానికి విరాట్ కోహ్లీ హాట్సాఫ్!
ఫార్చ్యూనర్ ధరకు జాగ్వార్
జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) బ్రిటన్‌లోని అతిపెద్ద కార్ల తయారీ కంపెనీలలో ఒకటి. దీని కర్మాగారం అక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలకు ఉపాధిని అందిస్తోంది. అక్కడి ఆర్థిక వ్యవస్థలో ఈ కర్మాగారానికి ఎంత విలువ ఉందో మీరు ఈ విషయం ద్వారా అర్థం చేసుకోవచ్చు. భారతదేశంతో FTA జరిగిన తర్వాత, బ్రిటన్ అమెరికాతో FTA పై సంతకం చేసినప్పుడు బ్రిటన్ ప్రధాని కీన్ స్టార్మర్ దీని ప్రకటన కోసం JLR ఫ్యాక్టరీనే ఎంచుకున్నారు.
జేఎల్ఆర్ పై భారతదేశానికి చెందిన టాటా మోటర్స్‌కు యాజమాన్య హక్కు ఉంది. ఈ ఒప్పందం తర్వాత టాటా మోటర్స్‌కు జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను భారతీయ మార్కెట్‌లోకి తీసుకురావడం ఈజీ అవుతుంది. ప్రస్తుతం భారతదేశంలో జాగ్వార్ ధర సుమారు 75 లక్షల రూపాయల నుండి ప్రారంభమవుతుంది. ఇప్పుడు దీనిపై పన్ను తగ్గిస్తే దీని ధర దాదాపు సగానికి పడిపోతుంది. అంటే, ప్రస్తుతం ఎంత ధరకు టయోటా ఫార్చ్యూనర్‌ను కొనుగోలు చేస్తున్నారో అదే ధరకు జాగ్వార్ లభిస్తుంది.
ఇప్పుడు ఈ ఒప్పందం తర్వాత టాటా మోటర్స్‌కు రెండు విధాలుగా ఆదాయం పెంచుకునే అవకాశం ఉంది. ఒకటి, కంపెనీ జాగ్వార్ ల్యాండ్ రోవర్ వంటి కార్లను తక్కువ ధరకు విక్రయించడం ద్వారా తన అమ్మకాలు, ఆదాయం, మార్కెట్ వాటాను పెంచుకోవచ్చు. రెండవ మార్గం.. కంపెనీ ఈ ప్రీమియం సెగ్మెంట్ కార్ల మార్కెట్ ధరను తగ్గించకుండా, వాటిపై తన లాభాల మార్జిన్‌ను పెంచుకోవచ్చు. దీని ద్వారా దాని లాభం అనేక రెట్లు పెరుగుతుంది.
ఈ రెండు పరిస్థితులలోనూ టాటా మోటర్స్ ఆదాయం, లాభం పెరుగుతాయి. దీనితో దాని షేర్ ఒక రాకెట్ వలె దూసుకుపోతుంది. భారత్-బ్రిటన్ FTA ఒప్పందం వార్తలు వెలువడినప్పటి నుండి టాటా మోటర్స్ షేర్‌లో పెరుగుదల కనిపిస్తోంది. ఈ వారం మొత్తం ట్రేడింగ్‌లో కంపెనీ షేర్ ధర 709 రూపాయల స్థాయిని తాకింది. ఈ సమయంలో దాదాపు 7 శాతం పెరుగుదల కనిపించింది. శుక్రవారం ఇది 700 రూపాయల కంటే ఎక్కువ వద్ద ట్రేడవుతోంది.