Hyundai Tucson 2026: కంపాక్ట్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ అమెరికాలో విశేషమైన ఆదరణ పొందాయి. సాధారణంగా ఎలక్ట్రిక్ కార్లను అమెరికా ప్రజలు ఇష్టపడతారు. అయితే స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ పెట్రోల్ వేరియంట్ లో మాత్రమే లభ్యమవుతాయి. ఎలక్ట్రిక్ వింగ్ లో లభించకపోయినప్పటికీ అమెరికా ప్రజలు పెట్రోల్ వేరియంట్ కొనుగోలు చేస్తున్నారంటే వీటికి ఉన్న డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
అమెరికా గడ్డమీద దుమ్మురేపిన కాంపాక్ట్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (compact SUV) ఇప్పుడు ఇండియన్ మార్కెట్లోకి వచ్చాయి. ఈ వేరియెంట్లో హ్యుందాయ్ టక్సాన్ (Hyundai Tucson) అనే మోడల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రీమియం డిజైన్, అత్యాధునిక సాంకేతికత, మెరుగైన పనితీరు ఈ మోడల్ ను అద్భుతమైన స్థాయిలో నిలుపుతున్నాయని చెబుతోంది.
ఈ మోడల్ లో హ్యుందాయ్ కంపెనీ స్టైల్, ఫెసిలిటీస్, స్మార్ట్ ఫీచర్లపై ప్రధానంగా దృష్టి సారించింది. ముఖ్యంగా అడ్వెంచర్ ను ఇష్టపడే వారికి ఈ మోడల్ ఎంతో గొప్పయుక్తంగా ఉంటుందని హ్యుందాయ్ కంపెనీ చెందుతుంది. ఇందులో ఫ్యూచర్స్టిక్ ఎక్స్టీరియర్ తర్వాత స్థాయి అనేటట్టుగా ఉంటుందని హ్యుందాయ్ కంపెనీ నిపుణులు చెబుతున్నారు. సిగ్నేచర్ ఫ్రంట్ గ్రిల్, అద్భుతమైన కాంతిని వెదజల్లే ఎల్ఈడి లైట్లు, దూకుడు తత్వాన్ని ప్రదర్శించే బాడీ లైన్ స్పోర్టీ అనుభూతి అందిస్తుంది.
స్టైలిష్ అల్లాయి వీల్స్, ఎల్ఈడి టెయిల్ లైట్లు, ప్రీమియం డిజైన్ ఈ కారుకు అదనపు ఆకర్షణగా ఉన్నాయి. ప్రీమియం మోడల్ కావడంతో.. ఇందులో ఇంటీరియర్ డిజైన్ ను హ్యుందాయ్ కంపెనీ సరికొత్తగా రూపొందించింది. విశాలమైన క్యాబిన్, అందులో ఉపరితలం కూడా మృదువుగా ఉంది. తద్వారా ప్రయాణికులకు విలాసవంతమైన అనుభూతి అందిస్తుంది.
విశాలమైన డాష్ బోర్డు, లాంగ్ సీట్లు లాంగ్ డ్రైవ్ కు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. పెద్ద టచ్ స్క్రీన్, ఇన్ఫో టైన్ మెంట్ సిస్టం ఆపిల్ కార్ ప్లే ఆండ్రాయిడ్ ఫోన్లకు అద్భుతంగా సపోర్ట్ చేస్తుంది. స్మార్ట్ ఫోన్ ఇంటిగ్రేషన్ విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. పూర్తిగా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అందుబాటులో ఉండడంతో స్పష్టమైన డ్రైవింగ్ సమాచారాన్ని అందిస్తుంది. వాయిస్ కంట్రోల్, నావిగేషన్ కూడా ఇందులో ఉంది. మారుమూల రహదారుల నుంచి మొదలు పెడితే జాతీయ రహదారుల వరకు ప్రతి రోడ్డు మీద ఈ వాహనాన్ని అద్భుతంగా నడపవచ్చు.
ఇందులో అడాప్ట్ క్రూజ్ కంట్రోల్, లేన్ కీపింగ్ అసిస్ట్, బ్లెండ్ స్పాట్ మానిటరింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, మోటర్నైజేషన్ డ్రైవింగ్ వంటి అదనప ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి. అందువల్ల సుదీర్ఘంగా డ్రైవింగ్ చేసినా ఎటువంటి ఇబ్బంది ఉండదు.