Homeబిజినెస్Hyderabad top city in India: చెన్నై , బెంగళూరు, ఢిల్లీ, కోల్ కతా కాదు.....

Hyderabad top city in India: చెన్నై , బెంగళూరు, ఢిల్లీ, కోల్ కతా కాదు.. ఆ విభాగంలో హైదరాబాదే తోపు..

Hyderabad top city in India: చెన్నై నగరం హైదరాబాద్ కంటే పెద్దది. పైగా సముద్రం కూడా ఉంది. విస్తారమైన భూభాగం ఉంది. అయినప్పటికీ హైదరాబాద్ నగరంతో పోటీ పడలేకపోతోంది.

కోల్ కతా లో నివాస యోగ్యమైన ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. పైగా అక్కడి భూములు కూడా నిర్మాణం రంగానికి అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ ఆ నగరం హైదరాబాద్ నగరానికి దరిదాపుల్లో కూడా లేదు.

ఢిల్లీలో కాలుష్యం ఎక్కువగా ఉంటుందని అంటారు. కానీ నోయిడా.. ఉత్తరప్రదేశ్ వైపు వెళ్లే దారుల్లో పర్యావరణం మెరుగ్గా ఉంటుంది. అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా జోరుగా సాగుతూ ఉంటుంది. అయినప్పటికీ ఢిల్లీ నగరం హైదరాబాద్ తో పోటీ పడలేకపోతోంది.

అహ్మదాబాద్ నగరంలో విస్తారమైన భూములు ఉంటాయి. పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తుంటాయి. అయినప్పటికీ ఆ నగరం హైదరాబాద్ దరిదాపుల్లో కూడా లేదు.

పూణే లో ఐటీ కార్యకలాపాలు ఎక్కువగా సాగుతుంటాయి. ఇక్కడ గృహాలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. పెద్దపెద్ద కంపెనీలు కూడా ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తుంటాయి. అయినప్పటికీ ఈ నగరం హైదరాబాద్ తో పోటీ పడలేకపోతోంది.

దేశవ్యాప్తంగా ఇళ్లవిక్రయాలు పడిపోయాయి. దీనికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. చెన్నై నుంచి మొదలుపెడితే ఢిల్లీ వరకు ఇదే పరిస్థితి ఉంది. కానీ హైదరాబాద్ నగరంలో ఇందుకు భిన్నమైన వాతావరణం ఉంది. దేశవ్యాప్తంగా అన్ని నగరాలలో గృహాల విక్రయాలపై జరిపిన సర్వేలో హైదరాబాద్ నగరం నెంబర్వన్ స్థానంలో నిలిచింది.

జనవరి నుంచి మార్చి నెల వరకు జరిపిన సర్వేలో దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాలలో గృహాల విక్రయాలు తగ్గిపోయాయి. హైదరాబాద్లో మాత్రం సానుకూల దృక్పథం కనిపిస్తోంది. ఇక్కడ గృహాల విక్రయాలు ఏకంగా ఒక శాతం పెరిగిపోయాయి. దేశ వ్యాప్తంగా చూసుకుంటే.. హైదరాబాద్ తో సహా ఎనిమిది నగరాలలో ఏకంగా 84,827 యూనిట్ల గృహాల జరిగాయి. గత ఎడాది మొదటి మూడు నెలల్లో 88,361 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. అప్పటితో చూస్తే నాలుగు శాతం తగ్గినప్పటికీ.. హైదరాబాదులో మాత్రం పరిస్థితి మెరుగ్గా ఉంది.

నైట్ ఫ్రాంక్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో హైదరాబాద్ నగరంలో సానుకూల వాతావరణ కనిపిస్తోందని వెల్లడించింది. ధరలు పెరుగుతూ పోవడం వల్ల చాలామంది గృహాలను కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదని నైట్ ఫ్రాంక్ సర్వేలో తేలింది. ఫలితంగా గృహాలు నిర్మించిన వారు పెద్దపెద్ద ప్రాజెక్టులను చేపట్టడానికి ముందుకు రావడం లేదు. దీనివల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కాస్త గందరగోళమైన వాతావరణం ఏర్పడింది. దీనికి తోడు భౌగోళిక వాతావరణం.. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో యుద్ధం జరగడం వల్ల ఆ ప్రభావం గృహాల విక్రయాల మీద పడింది. హైదరాబాద్ నగరంలో 541 యూనిట్ల అమ్మకాలు చోటుచేసుకున్నాయి. గత ఏడాది తో పోల్చి చూస్తే ఇది ఒక శాతం ఎక్కువ.

బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, పూణే, కోల్ కతా, ముంబై వంటి ప్రాంతాలలో గృహాల విక్రయాలు జరుగుతున్నప్పటికీ.. అవి హైదరాబాద్ స్థాయిలో లేకపోవడం విశేషం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version