సామాన్యుడికి భారీ షాక్.. ఆకాశాన్నంటిన చికెన్ రేటు..?

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మాంసం ప్రియులకు భారీ షాక్ తగిలింది. గత కొన్ని నెలలుగా సామాన్యులకు అందుబాటు ధరల్లోనే చికెన్ లభిస్తుండగా తాజాగా మరోసారి రేట్లు భారీగా పెరిగాయి. రెండు నెలల గ్యాప్ తరువాత చికెన్ రేట్లు కొండెక్కడంతో సామాన్యులు అరకిలో కొనాల్సిన చోట పావుకిలోతో సరిపెట్టుకున్నారు. కిలో 200 రూపాయల కంటే తక్కువ ఉన్న చికెన్ ఏకంగా 60 రూపాయలు పెరగడం గమనార్హం. మరోవైపు గుడ్ల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కొన్ని […]

Written By: Navya, Updated On : October 13, 2020 9:30 am
Follow us on

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మాంసం ప్రియులకు భారీ షాక్ తగిలింది. గత కొన్ని నెలలుగా సామాన్యులకు అందుబాటు ధరల్లోనే చికెన్ లభిస్తుండగా తాజాగా మరోసారి రేట్లు భారీగా పెరిగాయి. రెండు నెలల గ్యాప్ తరువాత చికెన్ రేట్లు కొండెక్కడంతో సామాన్యులు అరకిలో కొనాల్సిన చోట పావుకిలోతో సరిపెట్టుకున్నారు. కిలో 200 రూపాయల కంటే తక్కువ ఉన్న చికెన్ ఏకంగా 60 రూపాయలు పెరగడం గమనార్హం.

మరోవైపు గుడ్ల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కొన్ని రోజుల క్రితం వరకు 5 రూపాయలు పలికిన గుడ్డు ఇప్పుడు ఏకంగా 7 రూపాయలకు పెరగడంతో గుడ్లతో తయారయ్యే వంటకాల రేట్లు కూడా పెరిగాయి. దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో గత ఏడు నెలలుగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. దీంతో చాలామంది చికెన్, గుడ్లు తినడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని అనుకుంటున్నారు. అయితే చికెన్, గుడ్ల రేట్లు భారీగా పెరగడంతో చికెన్ కు ప్రత్యామ్నాయం గురించి మాంసం ప్రియులు ఆలోచిస్తున్నారు.

మరోవైపు కోడిగుడ్ల వినియోగం క్రమంగా పెరుగుతుండటం కూడా గుడ్ల ధర పెరగడానికి కారణమైంది. సాధారణంగా సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు గతంలో వారానికి ఒకసారి మాత్రమే చికెన్ ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపేవారు. అయితే ఊహించని విధంగా ఖర్చులు పెరగడంతో సామాన్యులు ప్రస్తుతం రెండు నుంచి మూడుసార్లు చికెన్ ను కొనుగోలు చేస్తున్నారు. కరోనా వ్లల ఫౌల్ట్రీ పరిశ్రమ దెబ్బ తినడం గుడ్లు, చికెన్ ధరల పెరుగుదలకు కారణమైంది.

కరోనా విజృంభించిన తొలినాళ్లలో ఫౌల్ట్రీ పరిశ్రమ దారుణంగా దెబ్బ తినడంతో దేశంలో చాలామంది కోళ్లపెంపకం దారులు కోళ్లను పెంచడానికి ఆసక్తి చూపలేదు. ఫలితంగా కోళ్ల సంఖ్య తగ్గడంతో గుడ్లు, చికెన్ ధరలు కొండెక్కాయి. రాబోయే రోజుల్లో చికెన్, గుడ్డు ధరలు మరింత పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చికెన్ వ్యాపారులు చెబుతూ ఉండటం గమనార్హం.