Gold Price Today: బంగారం ధరలు రెండు రోజుల పాటు భారీ షాక్ ఇచ్చాయి. నిన్న రూ.220 పెరిగగా.. తాజాగా రూ.350 అప్ కావడంతో కొనుగోలుదారులు షాక్ అవుతున్నారు. శుభకార్యాల వేళ బంగారం ధరలు పెరుగుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. అటు వెండి ధరలు సైతం దిగి రావడం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్ కు 222.34 డాలర్లుగా నమోదైంది. స్పాట్ సిల్వర్ ఔన్స్ కు 24.99 డాలర్లుగా ఉంది. ఈ నేపథ్యంలో దేశీయంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
బులియన్ మార్కెట్ ప్రకారం.. మార్చి 29న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,700గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.67,310 గా ఉంది. మార్చి28న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.61,360తో విక్రయించారు. 10 గ్రాముల బంగారానికి గురువారంతో పోలిస్తే శుక్రవారం రూ.350 పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,860 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.67,470గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.61,710 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.67,320 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.62,510 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.68,190తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.61,710 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.67,320తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.61,710తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.67,320తో విక్రయిస్తున్నారు.
బంగారంతో పాటు వెండి ధరలు కూడా ఎగబాకాయి. శుక్రవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.77,500గా నమోదైంది. గురువారంతో పోలిస్తే శుక్రవారం రూ.500 పెరిగింది. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.77,500గా ఉంది. ముంబైలో రూ..77,500, చెన్నైలో రూ.80,600, బెంగుళూరులో 75,800, హైదరాబాద్ లో రూ.80,600తో విక్రయిస్తున్నారు.