Honor Win Turbo features: చైనాకు చెందిన చాలా మొబైల్స్ ఇటీవల ఎక్కువగా మార్కెట్లోకి వస్తున్నాయి. వీటిలో Honor గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈ కంపెనీ నుంచి లేటేస్ట్ గా సరికొత్త స్మార్ట్‌ఫోన్ ‘Honor Win Turbo’ను చైనా మార్కెట్‌లో విడుదల అయింది. ఈ ఫోన్ ప్రధానంగా భారీ బ్యాటరీ సామర్థ్యం మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే దీని నిర్మాణం కూడా పటిష్టంగా ఉండడంతో రోజూవారీ వినియోగదారులకు ఈ మొబైల్ చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు. ఈ మొబైల్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..
Honor Win Turbo చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటుంది. అలాగే చాలా కఠినమైన పరిస్థితులను కూడా తట్టుకోగలదు. ఇందులో 6.79 అంగుళాల AMOLED భారీ డిస్ ప్లే కనిపిస్తుంది. ఇది 1.5K రిజల్యూషన్ తో ఉండడంతో విజువల్ పరంగా గొప్ప అనుభూతి కలుగుతుంది. దీని పీక్ బ్రైట్‌నెస్ ఏకంగా 8000 నిట్స్ వరకు ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉండటం తోఫోన్ వాడకం చాలా స్మూత్‌గా ఉంటుంది. ఇది ఈ ఫోన్ IP66, IP68, IP69, IP69K రేటింగ్ ఉండడంతో ఇది నీటిలో మునిగినా లేదా అధిక పీడనం కలిగిన నీటి ధారలను తాకినా చెడిపోదు.
గేమింగ్, మల్టీ టాస్కింగ్ కోసం ఇది అద్భుతమైన పనితీరును అందిస్తుంది. ఇందులో 16GB వరకు ర్యామ్, 512GB వరకు UFS 4.1 స్టోరేజ్ ఉండనుంది. ఫోన్ వేడెక్కకుండా ఉండటానికి ఇందులో 40,000 చదరపు మిల్లీమీటర్ల భారీ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉంది. అంతేకాకుండా, నెట్‌వర్క్ సరిగ్గా లేని చోట కూడా కాల్స్ అంతరాయం లేకుండా సాగేందుకు ఇందులో ప్రత్యేకమైన ‘C1+ RF’ చిప్‌ను అమర్చారు.
బ్యాటరీ మరియు ఛార్జింగ్:
ఈ ఫోన్ యొక్క అతిపెద్ద హైలైట్ దాని బ్యాటరీ. ఇందులో ఏకంగా 10,000mAh సామర్థ్యం గల ‘క్వింగ్‌హై లేక్’ సిలికాన్-కార్బన్ బ్యాటరీని అందించారు. సాధారణ ఫోన్లతో పోలిస్తే ఇది అత్యధిక బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుంది. కంపెనీ క్లెయిమ్ ప్రకారం, ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 17.3 గంటల నావిగేషన్ లేదా 14.2 గంటల నాన్-స్టాప్ గేమింగ్ చేయవచ్చు. దీనిని వేగంగా ఛార్జ్ చేయడానికి 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అలాగే, ఇది 27W రివర్స్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది, అంటే మీరు ఈ ఫోన్‌ను పవర్ బ్యాంక్‌లా ఉపయోగించి ఇతర పరికరాలను కూడా ఛార్జ్ చేయవచ్చు.
ఫోటోగ్రఫీ కోసం Honor Win Turbo మొబైల్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ను అమర్చారు. 50MP మెయిన్ సెన్సార్‌ను, అదనంగా 5MP వైడ్-యాంగిల్ కెమెరాను అందించారు. సెల్ఫీల కోసం ముందు భాగంలో 16MP కెమెరా ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, బ్లూటూత్ 6.0, NFC, మరియు USB టైప్-సి పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం ఇందులో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర విషయానికొస్తే, చైనాలో దీని ప్రారంభ ధర సుమారు 3,299 యువాన్లు (సుమారు రూ.46,000) నుంచి మొదలవుతుంది.
