Honda SP 160
Honda : హోండా గతేడాది డిసెంబర్‌లో తన బైక్ హోండా ఎస్‌పీ 160ని కొత్త అప్‌డేట్‌లతో విడుదల చేసింది. ఇది దాని ఇంజన్‌ను ఓబీడీ 2బీకి అనుగుణంగా మార్చింది. అనేక కొత్త ఫీచర్లను యాడ్ చేసింది. అయితే ఈ అప్‌డేట్ 160సీసీ మోటార్‌సైకిల్ కొనుగోలుదారులను ఆకట్టుకోలేకపోయింది. బైక్ అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. రష్‌లేన్ విక్రయాల డేటా ప్రకారం, ఫిబ్రవరి 2025లో ఎస్‌పీ 160 అమ్మకాలు దాదాపు 80శాతం క్షీణించాయి. భారతదేశంలో హోండా ఎస్‌పీ 160 కేవలం 1,117 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది. ఇది ఫిబ్రవరి 2024తో పోలిస్తే 78.33శాతం వార్షిక క్షీణతను చూపుతుంది. గతేడాది ఫిబ్రవరి నెలలోనే హోండా 5,155 యూనిట్లను విక్రయించింది. అంతేకాదు, జనవరితో పోలిస్తే కూడా ఫిబ్రవరి 2025లో బైక్ అమ్మకాలు దాదాపు 77.74శాతం క్షీణించాయి. హోండా జనవరిలో 5,019 యూనిట్లను విక్రయించింది.
Also Read : 91 కిమీ మైలేజ్‌తో సంచలనం సృష్టించిన బజాజ్ ఫ్రీడమ్ 125!
మన దేశంలో 160సీసీ కమ్యూటర్/స్పోర్ట్-టూరింగ్ సెగ్మెంట్‌లో హోండా ఎస్‌పీ 160 టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 160, బజాజ్ పల్సర్ 150, యమహా ఎఫ్‌జెడ్-ఎఫ్‌ఐ వీ4లకు పోటీ ఇస్తుంది. ఫిబ్రవరి 2025లోనే టీవీఎస్ అపాచీ సిరీస్ మొత్తం 37,954 యూనిట్లు, బజాజ్ పల్సర్ 150 13,917 యూనిట్లు విక్రయించగలిగాయి.
హోండా ఎస్‌పీ 160లో 162.71సీసీ, సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్ ఉంది. ఇది 13 హెచ్‌పి పవర్, 14.8 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజన్ 5-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఎస్‌పీ 160 ఏఆర్ఏఐ మైలేజ్ 65 కిమీ/లీటర్ అని పేర్కొన్నారు.
ఎస్‌పీ 160లో 4.2 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ ఉన్నాయి. ఇది హోండా రోడ్ సింక్ యాప్‌తో వస్తుంది. ఇందులో టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్, ఎస్ఎంఎస్ అలర్ట్‌లు, మ్యూజిక్ ప్లేబ్యాక్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఎస్‌పీ 160లో యూఎస్‌బీ టైప్-సీ ఛార్జర్ కూడా ఉంది. ఎస్‌పీ 160 రెండు వేరియంట్లలో లభిస్తుంది. సింగిల్ డిస్క్, డబుల్ డిస్క్ ఆప్షన్‌లు ఉన్నాయి. వీటి ఎక్స్-షోరూమ్ ధరలు వరుసగా రూ. 1.21 లక్షలు , రూ. 1.27 లక్షలు.
హోండా ఎస్‌పీ160 4 వేరియంట్లు, 8 రంగుల్లో అందుబాటులో ఉంది. హోండా ఎస్‌పీ160లో 162.71సీసీ బీఎస్6 ఇంజన్ ఉంది. ఇది 13.27 బీహెచ్‌పి పవర్, 14.58 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ముందు, వెనుక రెండు డిస్క్ బ్రేక్‌లతో, హోండా ఎస్‌పీ160 యాంటీ-లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్‌తో వస్తుంది. ఈ ఎస్‌పీ160 బైక్ బరువు 141 కిలోగ్రాములు, దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 12 లీటర్లు.