Honda new cars leaked on social media: భారతదేశంలో Honda కంపెనీకి చెందిన కార్లకు ఆదరణ తక్కువే ఉంటుంది. కానీ వినియోగదారులను ఆకర్షించే కొన్ని కార్లు మాత్రం ఉన్నాయి. అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్న కస్టమర్లకు అనుగుణంగా ఈ కంపెనీ కొత్త కార్లను మార్కెట్లోకి తీసుకువస్తూ ఉంటుంది. హోండా డీలర్లలో ఒకరైన క్రౌన్ హోండా ఇటీవల సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ ప్రకారం త్వరలో హోండా నుంచి రెండు కార్లు రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో ఒకటి సెడాన్ కాగా.. మరొకటి SUV ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సెడాన్ హోండా ఫేస్ లిఫ్టు అని తెలుస్తోంది. మరొకటి హైబ్రిడ్ ఎస్ యు వి అని తెలుస్తోంది. ఈ రెండు కార్లు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాం..
Honda కంపెనీ నుంచి మార్కెట్లోకి రాబోయే సెడాన్ ఫేస్ లిఫ్ట్ కావడంతో దీని డిజైన్ సాధారణంగానే ఉండే అవకాశం ఉంది. అయితే హెడ్ లాంప్స్ తో పాటు ఫ్రంట్ గ్రిల్, బంపర్ వంటివి పూర్తిగా ప్రీమియం లుక్ తో ఉంటాయని తెలుస్తుంది. అలాగే టెయిల్ లైట్స్ తోపాటు అల్లాయి వీల్స్ కు చిన్న బంపర్ ను చూడొచ్చు. ఈ మోడల్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో పనిచేయనుంది. ఈ ఇంజన్ 121 బిహెచ్పి పవర్ తో పాటు 145 ఎంఎం టార్క్ ను రిలీజ్ చేస్తుంది. ఈ ఇంజన్ మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దీనితోపాటు హైబ్రిడ్ వెర్షన్ కూడా ఉండబోతున్నట్లు సమాచారం. ఈ హైబ్రిడ్ వెర్షన్ లో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో పాటు బ్యాటరీ ప్యాక్ ద్వారా నడిచే ఎలక్ట్రిక్ మోటార్ కూడా సెట్అప్ చేయబడుతుంది.
Honda నుంచి రిలీజ్ అయ్యే మరో కారు ZRV SUV. ఇది ఈ ఏడాది చివరిలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫ్లాగ్ ఫిష్ తో పాటు SUV సెగ్మెంట్లో ఉండే ఇది Wolkswagen teran అనే కారుకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో టర్బో పెట్రోల్ ఇంజన్ ఉండనుంది. ఇది 2.0 నాచురల్లీ అస్పిరేటెడ్ తో పనిచేస్తుంది. ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో మాత్రమే ఉండే ఈ ఇంజన్ 141 బీహెచ్పీ పవర్ తో పాటు 182 NM టార్క్ ను రిలీజ్ చేస్తుంది. అంతేకాకుండా ఇందులో ఎలక్ట్రిక్ మోటార్ 184 పవర్ ను అందించగా.. 316 టార్క్ ను రిలీజ్ చేస్తుంది.
ఇది పూర్తిగా ప్రీమియం కారువలే తలపిస్తుంది. ఇందులో 9 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, గూగుల్ అసిస్టెంట్ ఇంటిగ్రేటెడ్, 12 స్పీకర్ బోస్ ప్రీమియం సౌండ్ సిస్టం, మల్టీ జోన్ క్లైమేట్ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా, యూఎస్బీ పోర్టు, ఆటో డిమింగ్ ఫ్రేమ్ లెస్ ఐ ఆర్ వి ఎం వంటి ఫీచర్లు ఉన్నాయి.