Jio : మీరు జియో ఉపయోగిస్తున్నారా? ఇక జియో ప్లాన్ లు ప్రతి సారి మారుతుంటే చాలా ఇబ్బందిగా అనిపించిందా? ఒక్కసారిగా ఈ ప్లాన్ లను పెంచడం వల్ల చాలా మంది bsnl కు ఛేంజ్ అయ్యారు. అయితే జియో నెట్ వర్క్ మెరుగ్గా ఉంటుందని కొందరు ఈ సర్వీస్ ను వినియోగిస్తున్నారు. ఏది ఏమైనా జియోను ఉపయోగిస్తున్నవారికి ఇప్పుడు 5G సర్వీస్‌ల ను వినియోగించే వారి కోసం కొన్ని ఉత్తమమైన ప్లాన్‌ల కూడా ఉన్నాయి. జియో తన 5G సేవ కింద అనేక అపరిమిత ప్లాన్‌లను కస్టమర్లకు అందిస్తుంది. దీంతో అన్ని రకాల వినియోగదారుల అవసరాలను తీర్చేలా ప్లాన్ చేసింది. ఈ ప్లాన్ లు విభిన్న వాలిడిటీ, డేటా ప్రయోజనాలను అందజేస్తున్నాయి. మరి వీటి నుంచి ఎలాంటి ప్రయోజనాలు అందుతాయో కూడా ఓ సారి చూసేద్దామా?
జియో అన్‌లిమిటెడ్ 5G ప్లాన్‌లు చాలా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకొని మీకు నచ్చినవి రిచార్జ్ చేసుకోండి.
రూ.349 ప్లాన్ తో రిచార్జ్ చేసుకుంటే ప్రతి రోజు 2GB వస్తుంది. ఇక 28 రోజుల వరకు ఎంజాయ్ చేయవచ్చు. ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అపరిమిత కాల్‌లు, 100 SMS/రోజు, JioCinema, JioTV, JioCloud వంటివి కూడా ఉపయోగించుకునే అవకాశం కల్పించారు.
రూ.899 ప్లాన్ తో రిచార్జ్ చేసుకుంటే ప్రతి రోజు 2GB డేటా వస్తుంది. 20GB అదనంగా పొందవచ్చు. 90 రోజులు చెల్లుబాటు అవుతుంది. అపరిమిత కాల్స్ తో పాటు 100 SMS/రోజు, JioCinema, JioTV, JioCloud వంటి అదనపు ప్రయోజనాలు పొందవచ్చు.
రూ.999 ప్లాన్ తో రిచార్జ్ చేసుకోవడం వల్ల ప్రతి రోజు 2GB డేటా వస్తుంది. 98 రోజుల ఎంజాయ్ చేయవచ్చు. అపరిమిత కాల్‌లు, 100 SMS/రోజు, JioCinema, JioTV, JioCloud వంటి అదనపు ప్రయోజనాలు ఉంటాయి.
రూ.2,025 ప్లాన్ తో రిచార్జ్ చేసుకుంటే ప్రతి రోజు 2.5GB డేటా తో 200 రోజులు టెన్షన్ ఉండదు. ఇక అపరిమిత కాల్‌లు, 100 SMS/రోజు, JioCinema, JioTV, JioCloud వంటి అదనపు ప్రయోజనాలు పొందవచ్చు..
రూ.3,599 ప్లాన్ ప్లాన్ తో రిచార్జ్ చేసుకుంటే ప్రతి రోజు 2.5GB డేటా తో 365 రోజులు ప్లాన్ వస్తుంది. ఇక అపరిమిత కాల్‌లు, 100 SMS/రోజు, JioCinema, JioTV, JioCloud వంటి వంటి అదనపు ప్రయోజనాలు ఉంటాయి..
ఇవి మాత్రమే కాదు మరిన్ని ఇతర 5G ప్లాన్‌లు కూడా ఉన్నాయి.
రూ. 749: 72 రోజులకు ఉపయోగించవచ్చు. 2GB/రోజు + 20 GB వస్తుంది. రూ. 859: 84 రోజులకు 2 GB/రోజు గా ఉంది.
రూ. 719: 70 రోజులకు 2 GB/రోజు
రూ. 629: 56 రోజులకు 2 GB/రోజు
రూ. 399: 28 రోజులకు 2.5 GB/రోజు
రూ. 449: 28 రోజులకు 3GB/రోజు
రూ. 1,028: 84 రోజులకు 2 GB/రోజు
రూ. 1,199: 84 రోజులకు 3GB/రోజు
రూ.349, రూ.399 వంటి ప్లాన్‌లు స్వల్ప కాలానికి బెటర్ గా ఉంటాయి. అయితే రూ.2,025, రూ.3,599 ప్లాన్‌లు దీర్ఘకాలికంగా ప్రయోజనకరంగా ఉన్నాయి. అన్ని ప్లాన్‌లు JioCinema, JioTV, JioCloud వంటి అదనపు సేవలను కూడా పొందవచ్చు. ఈ జియో ప్లాన్‌లు హై-స్పీడ్ డేటా, అపరిమిత కాల్‌లు, SMSలు వంటి ప్రయోజనాలను కూడా పొందవచ్చు.