Google Pay : గూగుల్ పే వాడేవారికి గుడ్ న్యూస్

వినియోగదారులకు సులభంగా రుణం అందించేందుకు గూగుల్ సంస్థ వెసులుబాటు కల్పిస్తోంది. గూగుల్ పే ఇతర ఫిన్ టెక్ కంపెనీలతో భాగస్వామ్య కుదుర్చుకుంది.

Written By: NARESH, Updated On : June 7, 2023 9:32 pm
Follow us on

Google Pay users : ఈ రోజుల్లో అందరు ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారు. దీంతో సులభమైన మార్గాల్లో డబ్బు ఖర్చు చేసేందుకు మార్గం ఏర్పడింది. ఇంతకు ముందు జేబులో డబ్బులు పెట్టుకుని తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు చేతిలో సెల్ ఉంటే చాలు ధీరగా బయటకు వెళ్లొచ్చు. ప్రస్తుతం అందరు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు. లోన్ కోసం తాపత్రయపడుతున్నారు.

వినియోగదారులకు సులభంగా రుణం అందించేందుకు గూగుల్ సంస్థ వెసులుబాటు కల్పిస్తోంది. గూగుల్ పే ఇతర ఫిన్ టెక్ కంపెనీలతో భాగస్వామ్య కుదుర్చుకుంది. దీంతో వినియోగదారులకు సులభంగా రుణాలు అందించేందుకు ముందుకొచ్చింది. రూ. 10 వేల నుంచి 3 లక్షల వరకు లోన్ ఇచ్చేందుకు నిర్ణయించుకుంది. దీంతో ఎలాంటి షరతులు లేకుండా రుణం పొందే అవకాశం ఏర్పడింది.

దీనికి పెద్ద ప్రాసెస్ కూడా లేదు. ఇంట్లో నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. రుణం తీసుకోవాలని భావించే వారు గూగుల్ పే యాప్ లోకి వెళ్లాలి. అక్కడ బిజినెస్ లు అని ఉంటుంది. దాని పక్కనే ఎక్స్ ప్లోర్ అని ఉంటుంది. దీనిపై క్లిక్ చేయాలి. ఇప్పుడు ప్రిఫర్ లోన్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు కిందకు వస్తే అప్లై నౌ అనే ఆప్షన్ ఉంటుంది.

దీనిపై క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకు అవసరమైన సమాచారం వస్తుంది. పాన్ కార్డు, ఆధార్ నెంబర్, ఎంప్లాయ్ మెంట్ వివరాలు వంటివి వస్తాయి. వాటికి సమాధానాలు ఇవ్వాలి. దీంతో మీకు లోన్ అర్హత ఉందో లేదో అనే సమాచారం తెలుస్తుంది. ఒకవేళ మనకు అర్హత ఉంటే మన ఖాతాలోకి డబ్బులు వస్తాయి. లేదంటే రావు. మీ క్రెడిట్ స్కోర్, క్రెడిట్ ప్రొఫైల్ వంటి అంశాలు మీకు లోన్ అర్హతను నిర్ణయిస్తాయి.