Gold Price Today: బంగారం ధరలు అందనంత ఎత్తుకు వెళ్తున్నాయి. కొన్ని రోజులుగా గరిష్ఠ స్థాయిలో పెరుగుతోంది. దీంతో బంగారం కొనుగోలు చేయాలంటే భయమేస్తుంది అని కొందరు వినియోగదారులు వాపోతున్నారు. అటు వెండి ధరలు సైతం భారీగా పెరిగాయి. నిన్న రూ.2000 పెరిగిన వెండి మరోసారి శుక్రవారం రూ.1000 పెరిగింది. మొత్తంగా రెండు రోజుల్లో రూ.3000 పెరగడం విశేషం. ఈ నేపథ్యంలో దేశీయంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
బులియన్ మార్కెట్ ప్రకారం.. ఏప్రిల్ 5న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,600గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.70,480 గా ఉంది. ఏప్రిల్ 4న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.64,100తో విక్రయించారు. 10 గ్రాముల బంగారానికి గురువారంతో పోలిస్తే శుక్రవారం రూ.500 పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,760 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.70,630 గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.64,600 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.70,480 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.65,460 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.71,410తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.64,600 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.70,480తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.64,600తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.70,480తో విక్రయిస్తున్నారు.
బంగారం ధరలతో పాటు వెండి ధరలు భారీగానే పెరిగాయి. శుక్రవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.82,000గా నమోదైంది. గురువారం కంటే శుక్రవారం వెండి ధరలు రూ.1000 పెరిగింది. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.82,000గా ఉంది. ముంబైలో రూ.82,000, చెన్నైలో రూ.85,400, బెంగుళూరులో 79,850, హైదరాబాద్ లో రూ.88,400తో విక్రయిస్తున్నారు.