Gold Price Today: బంగారం ధరలు కొనాలనుకునేవారికి శుభవార్త అని చెప్పొచ్చు. రెండు రోజుల పాటు తగ్గినట్లే తగ్గి నిన్న భారీగా పెరిగిన విషయం తెలిసిందే. అయితే గురువారం స్వల్పంగా ధరలు తగ్గాయి. దీంతో గరిష్ట స్థాయిలో పెరిగి స్వల్ప స్థాయిలో తగ్గడంతో కొనుగోలుదారులు నిరాశ చెందుతున్నారు. గ్లోబల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్ కు 2195 డాలర్లు నమోదైంది. సిల్వర్ రేటు ఔన్స్ కు 25.63 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. దేశీయంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
బులియన్ మార్కెట్ ప్రకారం.. మార్చి 21న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,790గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.66,320 గా ఉంది. మార్చి20న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.60,800తో విక్రయించారు. 10 గ్రాముల బంగారానికి బుధవారంతో పోలిస్తే గురువారం రూ.10 మాత్రమే తగ్గింది . దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,940 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.66,470గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.60,790 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.66,320 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.61,410 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.66,990తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.60.790 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.65,320తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.60,790తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.66,3230తో విక్రయిస్తున్నారు.
బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి. గురువారం ఓవరాల్ గా కిలో వెండి రూ.76,900గా నమోదైంది.బుదవారంతో పోలిస్తే గురువారం రూ.100 తగ్గింది. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.76,300గా ఉంది. ముంబైలో రూ..76,900, చెన్నైలో రూ.79,900, బెంగుళూరులో 75,400, హైదరాబాద్ లో రూ.79,900తో విక్రయిస్తున్నారు.