
గతేడాది కరోనా వైరస్ విజృంభించిన సమయంలో బంగారం ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. అయితే కరోనా విజృంభణ తగ్గిన తరువాత బంగారం ధరలు కూడా తగ్గాయి. గత కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతుండగా బంగారం ధరలు సైతం పెరుగుతున్నాయి. నేడు దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర 569 రూపాయలు పెరగడం గమనార్హం. స్వచ్చమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,536 నుంచి రూ.49,105కు పెరిగింది.
నగల తయారీ కొరకు వినియోగించే 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,459 నుంచి రూ.44,980కు చేరుకోవడం గమనార్హం. బంగారం ధరలు పెరిగితే వెండి ధరలు కూడా పెరగడం గమనార్హం. కిలో వెండి ధర ఏకంగా 752 రూపాయలు పెరిగి 71,700 రూపాయలకు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల బంగారం ధరలను పరిశీలిస్తే హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు ఒకే విధంగా ఉండటం గమనార్హం.
అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర 1,908 డాలర్లు ఉండగా, వెండి ఔన్సు 28.07 డాలర్లుగా ఉండటం గమనార్హం. హైదరాబాద్ మార్కెట్లో నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం రూ.45,600 నుంచి రూ.46,100కు పెరగగా పెట్టుబడులు పెట్టేందుకు వాడే 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల బంగారం ధర 50,300 రూపాయలుగా ఉంది.
బంగారం ధరపై వేర్వేరు అంశాలు ప్రభావం చూపుతాయనే సంగతి తెలిసిందే. బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో బంగారంపై ఇన్వెస్ట్ చేసే వాళ్ల సంఖ్య కూడా పెరుగుతుండటం గమనార్హం.