First Foldable iPhone : యాపిల్ కంపెనీ తమ మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్‌ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతుంది. ఈ ఫోన్ 2026 సెకండాఫ్ లో మార్కెట్లోకి రావొచ్చని తెలుస్తోంది. ఈ కొత్త ఫోన్ చాలా పవర్ ఫుల్ A20 ప్రో చిప్, స్లిమ్ డిజైన్‌తో వస్తుందని అంచనా. యాపిల్ దీని గురించి అధికారికంగా ఏమీ చెప్పకపోయినా, టెక్ నిపుణులు మాత్రం కంపెనీ చాలా ఏళ్లుగా దీని మీద సీక్రెట్ గా పనిచేస్తుందని అంటున్నారు.
Also Read: ‘కింగ్డమ్’ లో విజయ్ దేవరకొండ రియల్ స్టంట్స్ ఇలా ఉండబోతున్నాయా..?
ఈ ఫోన్లో ఐఫోన్ పుస్తకంలా తెరుచుకుంటుంది. లోపల 7.8-అంగుళాల పెద్ద ఓలెడ్ స్క్రీన్ ఉండవచ్చు. ఫోన్‌ను మడిచినప్పుడు, బయటవైపు 5.5-అంగుళాల చిన్న డిస్ప్లే ఉంటుంది. ఈ ఫోన్ 256GB, 512GB, 1TB వరకు స్టోరేజ్ ఆప్షన్లలో లభించవచ్చు. కెమెరా విషయానికి వస్తే, ఇందులో రెండు 48MP కెమెరాలు ఉండే అవకాశం ఉంది – ఒకటి దూరం నుండి ఫోటోలు తీయడానికి (వైడ్-యాంగిల్), మరొకటి ఎక్కువ ప్రదేశాన్ని కవర్ చేయడానికి (అల్ట్రా-వైడ్) కెమెరాలు ఉంటాయి. యాపిల్ ఈ ఫోన్‌ను సన్నగా , సులభంగా పట్టుకోవడానికి వీలుగా తయారుచేయడంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని కూడా చెబుతున్నారు. ఫోన్‌ను ఓపెన్ చేసినప్పుడు ఇది ఐప్యాడ్ మినీ లాగా కనిపించవచ్చు.
యాపిల్ తమ మొదటి ఫోల్డబుల్ డిస్ప్లే పేటెంట్‌ను 2014లోనే నమోదు చేసింది. ఇప్పుడు, కంపెనీ చివరకు ఆ కలను నిజం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. 2026లో ఈ ఫోన్ లాంచ్ అయితే, ఆ సంవత్సరం యాపిల్ ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్లోకి ప్రవేశించిన సంవత్సరంగా చరిత్రలో నిలిచిపోతుంది.