200 Rupee Note: డబ్బుతో ప్రపంచం ముడిపడి ఉంటుంది. ఏ వస్తువు కొనాలన్నా డబ్బు తప్పనిసరి. నిత్యం కోట్లాది డబ్బు చేతులు మారుతూ ఉంటుంది. అయినా కొత్త నోట్లుమార్కెట్లోకి నోట్లుమర్కెట్లోకి వస్తుంటాయి. డబ్బు లేనిదే పూటగడవని పరిస్థితి అందువల్ల మనీ నోట్స్ కనిపించగానే.. దానితో వ్యవహారాలు నడిపిస్తూ ఉంటారు. ఈ క్రమంలో కొన్ని నకిలీ నోట్లు వచ్చి చేరుతూ ఉంటాయి. ఇటీవల రూ.200 నోటు నకిలీవి ఎక్కువగా చెలామణి అవుతున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రూ.200 నకిలీ నోటు గుర్తించడంతో ఇప్పుడు ఆనోటు చూసి జంకుతున్నారు.
రూ.100, రూ.200, రూ.500 నోట్లు ప్రస్తుతం చలామణిలో ఉన్నాయి. నోట్ల మార్పిడి తరువాత రూ.2000 నోటు ఉండేది. ఆ తరువాత దానిని రద్దు చేశారు. అయితే ప్రస్తుతం తక్కవా.. ఎక్కువగా కాకుండా మధ్యస్థలో ఉన్నది రూ.200 మాత్రమే. అందువల్ల రూ.200 నోటు జేబులో ఉంటే బయటకు వెళ్లి తిరిగి రావొచ్చు. నిత్యావసరాల వస్తువులు కొనుగోలు చేయొచ్చు. రోజూ వారీ వేతనంగా రూ.200 కూడా ఇవ్వొచ్చు. దీంతో ఈ నోటును కొందరు నకిలీవి మార్కెట్లోకి తీసుకొచ్చారు.
2024 మే 8న ములుగు జిల్లా మంగపేటలో నకిలీ రూ.200 నోటును గుర్తించారు. దీనిని గుర్తించిన వ్యక్తి తనకు రూ.200 డూప్లకేట్ నోటు వచ్చిందని తెలిపాడు. అలాగే ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో రూ.200 నోట్లు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రూ.200 నోటు చూడగానే చాలా మంది భయపడుతున్నారు. రూ.100,రూ.500 కంటే రూ.200 నోట్లు ఎక్కువగా చెలామణిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీటిలో నకిలీవి కూడా ఉండడంతో చాలా మంది ఆందోళన చెందుతున్నారు.
అయితే రూ.200 దొంగనోటునో కాదో ముందే గుర్తించి తీసుకోవాలి. ఇందు కోసం నోటును పైకి ఎత్తి చూడగా వైట్ స్పేస్ లో గాంధీ బొమ్మ కనిపిస్తుంది. రూ.200 నోటులో 4 బ్లీడ్ లైన్ల మద్యలో రెండు చిన్న వృత్తాలు ఉంటాయి. బ్లీడ్ మార్క్ ను తాకినప్పుడు ఒకరకమైన స్పర్శ తెలుస్తుంది. దీనిని అసలైన నోటుగా అనుకోవచ్చు.