Tesla In India: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టెస్లా త్వరలో భారత్‌లో అడుగు పెట్టబోతోంది. ఈమేరకు దాదాపు ఏడాదిగా భారత్‌తో సంప్రదింపులు జరుపుతున్న సంస్థ చైర్మన్ మస్క్.. ఇటీవల అమెరికాలో ప్రధాని మోదీతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా అనుమతుల అంశం కొలిక్కి వచ్చింది. ఈ క్రమంలో టెస్లాకు భారత్‌లో అనుమతులు ఇచ్చే ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది. టెస్లాతో గతంలో తలెత్తిన విభేదాలను పరిష్కరించేందకు కూడా ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసింది. మొత్తంగా 2024 జనవరి నాటికి టెస్లాకు అనుమతులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.
భారత ప్రభుత్వానికి వినతి..
2024, జనవరి నాటికి భారత్‌లో టెస్లా కంపెనీ ఏర్పాటుకు అవసరమైన అనుమతులు ఇవ్వాలని కంపెనీ యాజమాన్యం ఇటీవల భారత ప్రభుత్వానికి లేఖరాసింది. ఈమేరకు కేంద్రం కూడా చర్యలు చేపట్టింది. ప్రధానమంత్రి కార్యాలయం ఇటీవల నిర్వహించిన సమావేశంలో టెస్లా పెట్టుబడి ప్రతిపాదనను కూడా కలిగి ఉన్న భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ తదుపరి దశను అంచనా వేసింది. ఈ సమావేశం ప్రధానంగా సాధారణ విధానలపై చర్చించారు. టెస్లా ప్రతిపాదిత పెట్టుబడికి ఆమోదాలను వేగవంతం చేయాల్సిన అవసరంపైనా చర్చించారు.
మోదీతో భేటీ తర్వాత కదలిక..
టెస్లా సీఈవో ఎలాన్‌మస్క్, భారత ప్రధాని నరేంద్రమోదీ గత జూన్‌లో అమెరికాలో సమావేశమయ్యారు. ఈ సమావేశం తర్వాత వాణిజ్యం,పరిశ్రమలు, భారీ పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖలు టెస్లా ప్రణాళికల గురించి చర్చలు జరుపుతున్నాయి. మరోవైపు గణతంత్ర వేడుకలకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ను ప్రధాని ఆహ్వానించారు. ఈలోగాటెస్లా భారత్‌లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
బ్యాటరీ కార్ల తయారీ ప్లాంటు..
టెస్లా సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు భారతదేశంలో కార్లు, బ్యాటరీల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయడం గురించి చర్చలు జరుపుతున్నారు. టెస్లా పర్యావరణ హిత ప్లాంటును మాత్రమే భారత్‌లో ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపుతోంది. అన్నీ చకచకా జరిగిపోతుండడంతో మరో నెల రోజుల్లో టెస్లాకు అనుమతులు అభించే అవకాశం ఉంది.
ఇవీ వివాదాలు..
టెస్లా భారత్ రాకపై గతంలో వివాదాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా
దిగుమతి సుంఖం తగ్గించడం. టెస్లా గతంలో పూర్తిగా అసెంబుల్డ్ ఎలక్ట్రిక్ కార్లపై 40% దిగుమతి సుంకాన్ని అభ్యర్థించింది, 40 వేల డాలర్లకంటే తక్కువ ధర ఉన్న వాహనాలకు ప్రస్తుతం ఉన్న 60% రేటు, ఆ పరిమితి కంటే ఎక్కువ ధర ఉన్న వాహనాలకు 100%. రేటు ఉంది. అయితే టెస్లా టెస్లా పూర్తిగా 40% దిగుమతి సుంకాన్ని డిమాండ్ చేస్తుంది. ఈ విషయమై కస్టమ్స్ సంస్థ విద్యుత్ సంస్థతో చర్చలు జరుపుతోంది. కార్లు మరియు హైడ్రోకార్బన్ పవర్డ్ వాహనాలు సమానంగా, తగిన సుంకాలను విధించడం, దేశీయ తయారీని ప్రోత్సహించడానికి యుఎస్‌కు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ స్థానిక తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ముందు భారతదేశంలో కార్ల విక్రయం ప్రారంభించాలని తన కోరికను వ్యక్తం చేసింది.
సమాలోచనలు..
ఈ సమస్యను పరిష్కరించడానికి, పర్యావరణ అనుకూల వాహనాలకు తక్కువ పన్ను విధించడానికి దారితీసే కొత్త దిగుమతి పాలసీ కేటగిరీని ప్రవేశపెట్టడం గురించి ఆలోచిస్తోంది. ఈ సంభావ్య ప్రోత్సాహకం టెస్లాకు మాత్రమే కాకుండా, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి కట్టుబడి ఉన్న ఏ సంస్థకైనా విస్తరించబడుతుందని అధికారులు నొక్కి చెప్పారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Elon musks tesla to enter india soon pmo asks govt departments to speed up approvals by january 2024
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com