Toyota Fortuner 2023: నేటి కాలంలో కార్లు కొనాలనుకునేవారు SUV లకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో పాటు ఇన్నర్ స్పేస్, అల్లాయ్ వీల్స్ తో ఇప్పుడొస్తున్న ఎస్ యూవీలు అలరిస్తున్నారు. అయితే తాజాగా అమెరికాలో పాపులర్ అయిన Tacoma తో పోటీ పడే విధంగా Toyota కొత్త SUVని డిజైన్ చేసింది. హిలక్స్ అండ్ నెక్స్ట్ జెన్ ఫార్చ్యునర్ ఆధారంగా కొత్త నెజ్ 2024 ఫార్చ్యునర్ ను అందుబాటులోకి తీసుకురానుంది. అత్యాధునికమైన హంగులతో పాటు మైలేజ్ ఇచ్చే ఈ కారు డిజైన్ ఆకట్టుకుంటోంది. అయితే ఈ కారు గురించిన వివరాలు ఆన్లైన్లో రిలీజ్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే.
Toyota న్యూ -జెన్ ఫార్చ్యునర్ చూడ్డానికి ఆకర్షణీయంగా ఉంటుంది. ఫ్రంట్ గిల్ తో పాటు హెడ్ ల్యాంప్స్ ఆకట్టుకుంటాయి. ఎల్ ఈడీ డీఆర్ఎస్ లోనూ మిగతా వాటికంటే రిచ్ గా ఉన్నాయి. రోడ్లు ఎలా ఉన్నా వాటికి అనుగుణంగా వెళ్తూ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేయడమే దీని లక్ష్యం. ఈ మోడల్ బాడీ మొత్తం పదునైన ప్యానలింగ్ తో కూడుకొని ఉంటుంది. బోల్డ్ గ్రూప్, లైన్ లు పటిష్టంగా ఉంటాయి. సాధారణ ఎస్ యూవీల్లో వలె కాకుండా ఇందులో బాడీ క్లాడింగ్ అంతటా కనిపిస్తుంది. వెనుక భాగంలో లెయిల్ ల్యాంప్స్, బంపర్ డిజైన్ ఆకట్టుకుంటుంది. చిసెల్డ్ ప్రొఫైల్ బానెట్, ప్లేర్డ్ వీల్ ఆర్ఛ్ లు వినియోగదారులను ఆకర్షిస్తాయి.
కొత్త ఫార్చ్యునర్ 2.8 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ తో పాటు 204 పీఎస్ శక్తిని అందిస్తుంది. మాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో పాటు 420 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 2.7 లీటర్ పెట్రోల్ ఇంజిన్ సౌకర్యం కూడా ఉంది. 48 మైల్డ్ హైబ్రిడ్ పవర్ ట్రైయిన్ ని కూడా పొందే అవకాశం. ఇందులో కొత్తగా Hiluxని కూడా అమర్చారు. 100 శాతం ఇథనాల్ తో పనిచేసే ఈ100 సామర్థ్య గల ఇప్పటికే ఆవిష్కరించారు. అయితే ఇది రావడానికి కొంత సమయం పట్టొచ్చు.
ఇక న్యూ -జెన్ పార్చ్యునరల్ వచ్చే ఏడాది ప్రారంభంలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇది అమెరికాలోని Tacomaతో పోటీ పడుతుందటే ఎవరూ నమ్మడం లేదు. కానీ అత్యాధునిక హంగులతో ఆకర్షిస్తున్న దీని గురించి తెలుసుకున్నవాళ్లు బుకింగ్ కోసం రెడీ అవుతున్నారు. కానీ ఈ మోడల్ ధర గురించి ఎలాంటి వివరాలు ప్రకటించలేదు. అయితే హిలక్స్ , జెన్ పార్చ్యునర్ తరహాలోనే దీని వాల్యూ ఉంటుందన్న చర్చ సాగుతోంది.