Ration Cards: దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కోట్ల సంఖ్యలో ప్రజలు రేషన్ కార్డులను కలిగి ఉన్నారు. రేషన్ కార్డుల ద్వారా సబ్సిడీ ధరకే సరుకులు పొందే అవకాశం ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పలు పథకాల ప్రయోజనాలను పొందాలన్నా రేషన్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలనే సంగతి తెలిసిందే. అయితే రేషన్ కార్డును కలిగి ఉన్నవాళ్లు కొన్ని తప్పులను మాత్రం అస్సలు చెయ్యకూడదు. ఒకవేళ ఈ తప్పులు చేస్తే మాత్రం ఇబ్బందులు తప్పవు.
రేషన్ సరుకులు ఆరు నెలలు వరుసగా తీసుకోకపోతే కొన్నిసార్లు రేషన్ కార్డుదారులు రేషన్ కార్డును కోల్పోయే అవకాశాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలను బట్టి ఈ నిబంధన విషయంలో మార్పులు ఉంటాయి. అయితే ఈ విధంగా ఒకవేళ రేషన్ కార్డ్ క్యాన్సిల్ అయినా ఆ రేషన్ కార్డును మళ్లీ యాక్టివేట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. చాలా కాలంగా రేషన్ కార్డును ఉపయోగించకపోయినా రేషన్ కార్డుదారులు ఇబ్బందులు పడాల్సి ఉంది.
Also Read: Kotha Bangaru Lokam: ‘కొత్త బంగారు లోకం’ మూవీని మిస్ చేసుకున్న స్టార్ హీరో కుమారుడు
కుటుంబ సభ్యులలో ఎవరైనా మరణిస్తే ఆ వ్యక్తి పేరును రేషన్ కార్డునుంచి తొలగించుకొని రేషన్ సరుకులు తీసుకోవాలి. వివరాలను తప్పుగా ఇచ్చి రేషన్ సరుకులను తీసుకున్నా ఇబ్బందులు తప్పవని గుర్తుంచుకోవాలి. పేద కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డుల ద్వారా పేద ప్రజలకు రేషన్ సరుకులను అందిస్తుండటం గమనార్హం.
కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నా, పన్ను చెల్లిస్తున్నా, ఆదాయం ఎక్కువగా ఉన్నా మీరు రేషన్ కార్డును పొందడానికి అర్హులు కాదు. అర్హత లేని వాళ్లు రేషన్ కార్డ్ ద్వారా బెనిఫిట్స్ ను పొందితే మాత్రం భవిష్యత్తులో ఇబ్బందులు పడక తప్పదు.
Also Read: Somu Veerraju: పవన్ కళ్యాణ్ యే సీఎం.. టీడీపీని డిఫెన్స్ లో పడేసిన సోము వీర్రాజు