Cracks On Building: ఇల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. సొంత ఇంట్లో ఉన్న ఆ హాయి వేరే ఉంటుంది. ఈ నేపథ్యంలో కొందరు సొంత ఇల్లును తమకు అనుగుణంగా.. అన్ని సౌకర్యాలు ఉండేలా నిర్మించుకుంటారు. అయితే తమ కలల సౌధంను నిర్మించుకునే క్రమంలో మంచి బిల్డర్ ను కూడా ఎంచుకోవాలి. ఈ విషయంలో చిన్న పొరపాటు జరిగినా ఇల్లు అనుకున్న విధంగా నిర్మీతం కాదు. అయితే ఒక్కోసారి మంచి బిల్డర్ ను ఎంచుకోవడంలో పొరపాట్లు చేస్తుంటాం. దీంతో ఇల్లు కట్టి ఏడాది కాకముందే పగుళ్లు ఏర్పడుతాయి. అయితే ఇలా ఏడాదిలోపే మరమ్మతులకు వచ్చిన ఇంటిని ఒక్కరూపాయి కూడా చెల్లించకుండా మరమ్మతులు చేసుకోవచ్చు. ఎలాగంటే?
ప్రతీ సమస్యకు ఓ పరిష్కార ఉన్నట్లే.. ప్రతి నష్టానికి ఓ పరిహారం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఇంటి నిర్మాణం విషయంలో చాలా మందికి తెలియని విషయమేంటంటే బిల్డింగ్ నిర్మించే కాంట్రాక్టులు Real Estate Regulatory Authority(RERA) కిందకు వస్తారు. ఇల్లు కొనేవారికి భద్రత కల్పించడానికి, రియల్ ఎస్టేట్ పెట్టుబడుదారులను ప్రోత్సహించడానికి దీనిని ఏర్పాటు చేశారు. ఇది 2016 మే 1 నుంచి అమల్లోకి వచ్చింది.
2016 సెక్షన్ 84 ప్రకారం రియల్ ఎస్టేట్ రంగంలో కొన్ని నిబంధనలను విధించారు. ఈ చట్టం ప్రకారం ఏదైనా బిల్డింగ్ నిర్మించుకున్న కొనుగోలుదారుడికి ఆ భవనం నాణ్యతపై 5 సంవత్సరాల గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఐదేళ్ల వరకు ఎటువంటి పగుళ్లు, లేదా డ్యామేజ్ లేకుండా ఇంటిని నిర్మించాలి. ఒకవేళ 5 సంవత్సరాల లోపు బిల్డింగులో పగుళ్లు ఏర్పడినా.. ఏదైనా మరమ్మతులు చేయాల్సి వచ్చినా ఆ ఖర్చులను బిల్డరే భరించాలి. లేకుంటే కొనుగోలు దారులు ఈ చట్టం ప్రకారం ఫిర్యాదు చేయవచ్చు.
ఒకవేళ ఫిర్యాదుపై రెరా చట్టం చర్యలు తీసుకుంటే బిల్డర్ నుంచి భారీగా పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అయినా కూడా స్పందించకపోతే కేసు కూడా నమోదు చేసే అవకాశం ఉంది. అందువల్ల బిల్డింగ్ నిర్మించుకునేవారు బిల్డర్ నుంచి ముందే నాణ్యంగా నిర్మాణం చేపట్టాలనే హామీ తీసుకోండి. లేకపోతే ఆ తరువాత భారీగా నష్టపోవాల్సి వస్తుంది.