Nirav Modi: మనదేశంలో బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకొని.. తిరిగి చెల్లించకుండా.. విదేశాలకు వెళ్లిపోయిన వ్యాపారులలో నీరవ్ మోడీ ఒకరు.. అనేక బ్యాంకుల వద్ద అప్పులు తీసుకొని.. వాటిని చెల్లించకుండా నీరవ్ విదేశాలకు పారిపోయారు. అతడి అప్పుల మీద.. చేసిన మోసాల మీద ఇప్పటికి కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ కొనసాగిస్తూనే ఉంది.
నీరవ్ మోడీకి సంబంధించి విచారణ సాగిస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ.. కీలక విషయాని వెల్లడించింది. నీరవ్ మోడీకి సంబంధించిన ఆస్తులను ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సీజ్ చేసింది. ఇందులో రెండు కార్లు కూడా ఉన్నాయి. అయితే వీటిని వేలం వేయడానికి స్పెషల్ జడ్జి జస్టిస్ ఏవి గుజరాతి అనుమతి ఇచ్చారు.. నీరవ్ కు చెందిన Benz GLE 250(39 lakhs), Skoda superb elegance (7.5 lakhs) కార్లను వేలం వేసి.. అలా వచ్చిన డబ్బులు జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేయాలని పేర్కొన్నారు. Enforcement directorate సీజ్ చేసిన మూడు కార్ల వేలానికి అనుమతి కోరగా.. ఇందులో రెండింటికి మాత్రమే అనుమతి వచ్చింది.
నీరవ్ ఆస్తుల వేలానికి సంబంధించిన విషయం సోషల్ మీడియా ద్వారా విపరీతంగా ప్రచారంలో ఉంది.. ఈ నేపథ్యంలో నెటిజన్లు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు.. ఆ కార్లను సొంతం చేసుకోవాలంటే కచ్చితంగా 46.5 లక్షల నగదు ఉండాలేమోనని పేర్కొంటున్నారు.. ” నీరవ్ వ్యవహారంలో సరికొత్త పరిణామం వెలుగులోకి వచ్చింది. ఆయన వాడిన కార్లలో రెండింటిని వేలం వేస్తారట. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉంది. మన వ్యవస్థలు కూడా సక్రమంగా పనిచేస్తున్నట్టు దీనిని బట్టి అర్థం చేసుకోవాలి. వీటి విలువ గురించి చెప్పిన అధికారులు.. ఎంతకు అమ్ముతారో మాత్రం చెప్పలేదు. అప్పటికి ఇప్పటికీ వాహనాలలో అనేక మార్పులు వచ్చాయి. నేటి కాలంలో ఆ వాహనాలను కొనుగోలు చేస్తారా? ఒకవేళ అంత డబ్బులు పెట్టి కొనుగోలు చేస్తే అవి ఆ స్థాయిలో మన్నగలుగుతాయా? అంతు పట్టడం లేదని” నెటిజన్లు పేర్కొంటున్నారు.
నీరవ్ వాడిన కార్లు మాత్రమే కాకుండా, ఇంకా చాలా ఆస్తులను స్వాధీనం చేసుకొని వేలం వేస్తే బ్యాంకుల దగ్గర తీసుకున్న అప్పులు కొంతలో కొంత తీరుతాయని నెటిజన్లు పేర్కొంటున్నారు. నీరవ్ లాంటి ఆర్థిక నేరస్థులకు కోట్లకు కోట్లు రుణాలు ఇచ్చే బ్యాంకులు.. సామాన్యుల విషయంలో మాత్రం అనేక రకాల షరతులు పెడతాయని నెటిజన్లు అంటున్నారు.. ప్రభుత్వాలు ఇప్పటికైనా నీరవ్ లాంటి ఆర్థిక నేరస్థులపై ఉక్కు పాదం మోపాలని.. వారి ఆస్తులను వేలం వేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.