Homeబిజినెస్Bitcoin mystery: బిట్ కాయిన్ అంటేనే మాయా ప్రపంచం.. దాని సృష్టికర్త కూడా అలాంటివాడే.. వెలుగులోకి...

Bitcoin mystery: బిట్ కాయిన్ అంటేనే మాయా ప్రపంచం.. దాని సృష్టికర్త కూడా అలాంటివాడే.. వెలుగులోకి అసలు నిజం

Bitcoin mystery: మార్కెట్ రంగ నిపుణులకు.. ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్.. వంటి విభాగాలలో పనిచేస్తున్న వారికి బిట్ కాయిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఒక రకమైన క్రిప్టో కరెన్సీ.. దీనిపై అనేక రకాల విమర్శలు.. ఆరోపణలు వచ్చినప్పటికీ ప్రపంచంలో చలామణి అవుతూనే ఉంది. కొన్ని దేశాలు దీనిని నిషేధిస్తే.. మరికొన్ని దేశాలు కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నాయి.

బిట్ కాయిన్ అనేది క్రిప్టో కరెన్సీ. ఒక ముక్కలో చెప్పాలంటే కంటికి కనిపించని డబ్బు అన్నమాట. ఇదంతా కూడా ఒక మాయ ప్రపంచం. బిట్ కాయిన్ ద్వారా పెట్టుబడులు పెట్టేవారు.. లావాదేవీలు నిర్వహించేవారు కొన్ని సంవత్సరాలుగా.. అన్వేషణ సాగిస్తూనే ఉన్నారు. బిట్ కాయిన్ రూపొందించిన వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు.. అయితే ఈ కరెన్సీ క్రియేటర్ గురించి న్యూయార్క్ టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది. అంతేకాదు పేరుని కూడా వెల్లడించింది.

బిట్ కాయిన్ రూపొందించిన వ్యక్తి పేరు ఆడం బ్యాక్. ఇతడు బ్రిటిష్ లో క్రిఫ్టాలజిస్ట్ గా పనిచేస్తుంటాడు. కొన్ని నెలలపాటు నిరాటంకం గా జరిపిన దర్యాప్తులో ఈ విషయాన్ని గుర్తించారు.. బ్యాక్ క్రిప్టో కమ్యూనిటీని ఏర్పాటు చేశాడు.. తొలి రోజుల్లో అతడు అనేక రకాలుగా పరిశోధనలు చేశాడు. ఆ తర్వాత బిట్ కాయిన్ ను సృష్టించాడు.. అయితే ఇప్పటివరకు బిట్ కాయిన్ ను రూపొందించింది నకమోటో అని అందరూ అనుకున్నారు. అయితే అతడు పంపించిన ఈమెయిల్ పరిశీలిస్తే.. అసలు వివరాలు తెలిసాయి. అతడు ఉపయోగించిన ముద్రలు.. పంపించడం మెయిల్స్ ని బట్టి అవి బ్రిటన్ లేదా అమెరికా తూర్పు లేదా పశ్చిమ తీరానికి వెళ్లి ఉంటాయని గుర్తించారు. నకమోటో తన ఈ మెయిల్స్ లో కొన్ని పదాలకు బ్రిటిష్ అక్షరాలను ఉపయోగించేవాడు.. అందువల్లే నకమోటో బ్రిటన్ దేశానికి చెందిన వాడని గుర్తించారు. బ్యాక్ గతంలో ఆన్లైన్ లో వాడిన భాష కూడా నకమోటో ఉపయోగించిన భాషకు దగ్గరగా ఉంది. అందువల్లే అంతర్జాతీయ మీడియా ఈ కథనాన్ని ప్రసారం చేసింది

నకమోటో ఏకంగా 31 వేల లైన్ల కోడ్ రూపొందించాడు. దానిద్వారా బిట్ కాయిన్ సృష్టించాడు.. అతడి సంతకం తో కూడిన బిట్కాయిన్ పి టి పి ఓ ఈ క్యాష్ పేపర్ 2008లో బయటికి వచ్చింది. ఆ పేపర్లో బ్యాక్ పేరు ప్రముఖంగా కనిపించింది. అప్పుడు నకమోటో బ్యాక్ ను కలిసినట్టు వార్తలు వచ్చాయి. దీంతో వారిద్దరూ వేరువేరు వ్యక్తులని ప్రచారం జరిగింది.. బిట్ కాయిన్ రూపకర్తను దాచిపెట్టడానికి ఈ నాటకం ఆడినట్టు తెలుస్తోంది.. అయితే బ్యాక్ ఈ వ్యవహారం మీద స్పందించాడని.. తాను నకమోటో కాదని పదేపదే చెప్పాడని తెలుస్తోంది.

ఇప్పటికే నకమోటో అజ్ఞాతంలో ఉన్నాడు. దీనికి బిట్ కాయిన్ విలువ కారణమని తెలుస్తోంది. ప్రభుత్వాలు, నేర మయ వ్యక్తుల వల్ల అతడికి ఇబ్బందులు ఎదురవుతున్నట్టు తెలుస్తోంది. అతడికి ఈ క్రిప్టో కరెన్సీ మీద ఆసక్తి కూడా తగ్గినట్టు సమాచారం. దానివల్లే అతడు మాయ ప్రపంచాన్ని వదిలిపెట్టినట్టు ప్రచారం జరుగుతుంది. మరోవైపు కోడ్ కూడా రోజురోజుకు కఠినంగా మారుతుంది. నిబంధనలలో లోపాలు సర్వ సాధారణంగా మారిపోతున్నాయి.. అందువల్లే అతడు అజ్ఞాతంలో ఉన్నట్టు తెలుస్తోంది..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...
Oktelugu Epaper
Exit mobile version