Best Handheld Gaming Devices 2026: మొబైల్ లో గేమింగ్ కోరుకునేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అయితే గేమింగ్ కు ప్రత్యేకంగా డివైజ్ ఉండం వల్ల మరింత అనుభూతి కలుగుతుంది. ఇప్పటికే ఇలాంటి డివైజ్ లు మార్కట్లోకి వచ్చాయి. అయితే 2026 సంవత్సరంలో హ్యాండ్‌హెల్డ్ గేమింగ్ ప్రపంచం విప్లవాత్మక మార్పులకు లోనైంది. ఆండ్రాయిడ్ ఆధారిత రెట్రో గేమింగ్ నుంచి శక్తివంతమైన విండోస్ పీసీ గేమింగ్ వరకు, గేమర్లు తమకు నచ్చిన పరికరాన్ని ఎంచుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది మార్కెట్లో నిలుస్తున్న అత్యుత్తమ 6 హ్యాండ్‌హెల్డ్ గేమింగ్ డివైజ్‌ల గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..
స్టీమ్ డెక్ OLED:
హ్యాండ్‌హెల్డ్ గేమింగ్ కేటగిరీలో ఇది ఇప్పటికీ రారాజుగా కొనసాగుతోంది. అద్భుతమైన OLED డిస్ప్లే, తక్కువ బరువు, మెరుగైన బ్యాటరీ లైఫ్ దీని ప్రధాన ఆకర్షణలు. స్టీమ్ ఓఎస్ ) ద్వారా లభించే సాఫీ గేమింగ్ అనుభవం, గేమర్లకు అత్యంత సౌకర్యవంతమైన గేమింగ్‌ను అందిస్తుంది.
ఆసుస్ రోగ్ ఎక్స్‌బాక్స్ అలై X20 :
ఆసుస్ రోగ్ 20వ వార్షికోత్సవం సందర్భంగా విడుదలైన ఈ పరికరం, గేమింగ్ ప్రపంచంలో ఒక కొత్త బెంచ్‌మార్క్. ఇందులో 7.4-అంగుళాల HDR OLED డిస్ప్లే ఉండటమే కాకుండా, వినూత్నమైన ‘ట్రాన్స్ఫార్మింగ్ డి ప్యాడ్’ని అమర్చారు. ఇది విండోస్ 11తో పనిచేస్తుంది కాబట్టి. భారీ గేమ్స్ ఆడే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.
ఎంఎస్ఐ క్లా 8 EX AI ప్లస్:
పెర్ఫార్మెన్స్ విషయంలో ఈ పరికరం అద్భుతమైన సామర్థ్యాన్ని చూపుతుంది. ఇంటెల్ ఆర్క్ G3 ఎక్స్ట్రీమ్ చిప్సెట్తో వస్తున్న ఈ పరికరం, గేమింగ్ ఫ్రేమ్ రేట్లను పెంచడానికి AI ఆధారిత ఫీచర్లను వాడుకుంటుంది. ఇది హై-ఎండ్ పీసీ గేమింగ్‌ను హ్యాండ్‌హెల్డ్ రూపంలో అనుభవించాలనుకునే వారికి సరైన ఎంపిక.
వన్ ఎక్స్ ప్లేయర్ 3 :
ఇది కేవలం గేమింగ్ పరికరం మాత్రమే కాదు, ఒక 3 ఇన్ వన్ డివైజ్. ఇది గేమింగ్, ప్రొడక్టివిటీ AI పనులకు అనువుగా రూపొందించబడింది. ఇందులో 8.8 అంగుళాల భారీ 144Hz OLED డిస్ప్లే ఉంటుంది. పెద్ద స్క్రీన్, అత్యుత్తమ గ్రాఫిక్స్ కోరుకునే వారికి ఇది ఒక పవర్‌హౌస్ లాంటిది.
రెట్రాయిడ్ పాకెట్ 5 :
రెట్రో గేమింగ్ అంటే ఇష్టమైతే, ఇది అత్యుత్తమ ఆండ్రాయిడ్ హ్యాండ్‌హెల్డ్. ఇది చాలా కాంపాక్ట్‌గా, తక్కువ బరువుతో ఉంటుంది. పాత కాలపు ఎమ్యులేషన్ గేమ్స్ మరియు ఆధునిక ఆండ్రాయిడ్ గేమ్‌లను ఆడటానికి ఇది చాలా సరసమైన మరియు శక్తివంతమైన ఎంపిక.
