ఎల్‌ఐసీ సూపర్ స్కీమ్.. రూ.28 పొదుపుతో రూ.2 లక్షలు పొందే ఛాన్స్?

దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో పాలసీలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాలసీలలో కొన్ని పాలసీలకు ఎక్కువ మొత్తంలో ప్రీమియం చెల్లించాల్సి ఉండగా మరికొన్ని పాలసీలకు తక్కువ మొత్తం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఎల్‌ఐసీ మైక్రో పాలసీలను కూడా అందిస్తుండగా కేవలం రోజుకు 28 రూపాయల పొదుపుతో రూ.2 లక్షలు పొందవచ్చు. మైక్రో బచత్ ప్లాన్‌ పేరుతో ఎల్‌ఐసీ ఈ పాలసీని ఆఫర్ చేస్తుండటం గమనార్హం. […]

Written By: Kusuma Aggunna, Updated On : August 11, 2021 4:37 pm
Follow us on

దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో పాలసీలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాలసీలలో కొన్ని పాలసీలకు ఎక్కువ మొత్తంలో ప్రీమియం చెల్లించాల్సి ఉండగా మరికొన్ని పాలసీలకు తక్కువ మొత్తం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఎల్‌ఐసీ మైక్రో పాలసీలను కూడా అందిస్తుండగా కేవలం రోజుకు 28 రూపాయల పొదుపుతో రూ.2 లక్షలు పొందవచ్చు.

మైక్రో బచత్ ప్లాన్‌ పేరుతో ఎల్‌ఐసీ ఈ పాలసీని ఆఫర్ చేస్తుండటం గమనార్హం. ఎవరైతే మైక్రో బచత్ పాలసీని తీసుకుంటారో వాళ్లు రక్షణ, పొదుపుతో పాటు ఇతర ప్రయోజనాలను కూడా పొందే అవకాశాలు అయితే ఉంటాయి. 50,000 రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల బీమా మొత్తానికి ఈ పాలసీని తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ పాలసీ నాన్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ కావడం గమనార్హం.

18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీని తీసుకునే అవకాశం ఉంటుంది. మూడు సంవత్సరాలు ప్రీమియం చెల్లించడం ద్వారా లోన్ ఫెసిలిటీని పొందే అవకాశం ఉంటుంది. పాలసీ ప్రీమియంను నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది చొప్పున తీసుకునే అవకాశం ఉండగా 10 నుంచి 15 సంవత్సరాల కాలపరిమితితో ఈ పాలసీని తీసుకోవచ్చు.

ఎక్కువ మొత్తం ప్రీమియం చెల్లించలేని వాళ్లు ఈ పాలసీని తీసుకోవచ్చు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో ఎల్‌ఐసీ ఈ పాలసీని అందిస్తుండటం గమనార్హం. సమీపంలోని ఎల్‌ఐసీ బ్రాంచ్ ను సంప్రదించి ఈ పాలసీకి సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు.