Iphone 17 Series: ప్రపంచవ్యాప్తంగా iphone కు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. దీని ధర కాస్త ఎక్కువగా ఉన్నా.. కొనడానికి ఎగబడుతూ ఉంటారు. భారతదేశంలో అయితే ఐఫోన్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతూ ఉంటాయి. ధర ఎంత ఉన్న కొత్త ఐఫోన్ రాగానే వెంటనే దానిని రక్షించుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే 2025 సంవత్సరంలో ఆపిల్ కంపెనీ సంచలనం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది మొత్తంలో 25 వరకు మొబైల్స్ ను అప్డేట్ చేసింది. పాత వాటిని తొలగించి వాటి స్థానంలో కొత్త వాటిని తీసుకువచ్చింది. 2025 ఫిబ్రవరిలో మొదలైన తొలగింపు ప్రక్రియ మొత్తంగా అనేక ప్రముఖ మొబైల్స్ ను అప్డేట్ చేసింది. వాటి వివరాల్లోకి వెళితే..
కాలం మారుతున్న కొద్దీ వినియోగదారుల అభివృద్ధిలో మారిపోతున్నాయి. ముఖ్యంగా టెక్నాలజీలో విప్లవం సృష్టించిన మొబైల్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుండటంతో వినియోగదారుల సైతం కొత్తదనం కోరుకుంటూ ఉంటారు. ఇందుకు అనుగుణంగా ఆపిల్ కంపెనీ మొబైల్స్ లో ఉన్న టెక్నాలజీని అప్డేట్ చేస్తూ వస్తోంది. ఈ కంపెనీకి చెందిన ఐఫోన్ 16 ప్రో మొదటిసారిగా ఫిబ్రవరిలో నిలిపివేసింది. ఆ తర్వాత ఐఫోన్ 16 ప్రో మాక్స్, ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ వంటి మొత్తం 25 మోడల్స్ను నిలిపివేసినట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే వీటి స్థానంలో ఐఫోన్ 17, ఐఫోన్ ఎయిర్, 17 ప్రో, ప్రో మాక్స్ వంటివి ఫోన్లను అప్డేట్ చేస్తూ వినియోగదారులకు అనుగుణంగా మార్కెట్లోకి తీసుకువచ్చింది. తొలగించిన ఫోన్లకు మార్కెట్లో ఎక్కువగా డిమాండ్ లేకపోవడం.. వినియోగదారులు కొత్తదనాన్ని కోరుకోవడం.. నేటి తరానికి ఉపయోగపడే విధంగా ఫోన్ లను మార్చాల్సి రావడంతో పాత ఫోన్ లను తొలగించాల్సి వచ్చిందని తెలుపుతోంది.
2025 సెప్టెంబర్ లో విడుదలైన ఐఫోన్ 17 సిరీస్ కోసం పాత మోడల్ నిలిపివేసినట్లు మరో అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా వినియోగదారుల్లోనూ ఐఫోన్ల విషయంలో కొంత అయోమయం నెలకొంది. ఆపిల్ కంపెనీకి చెందిన ఉత్పత్తుల్లో పాత చిప్ సెట్ A18 pro వంటి డిజైన్లు కొత్త మొబైల్స్ తో పోటీ పడలేక పోతున్నాయి. పాత మోడల్ ఫోన్లు నేటి వినియోగదారులకు అనుగుణంగా లేకపోవడం.. వినియోగదారులు ఎప్పటికప్పుడు కొత్త ఫోన్లు కావాలని కోరుకోవడం వంటి కారణాలతో పాత ఫోన్లను తొలగించినట్లు తెలుపుతోంది.
అంతేకాకుండా పాత ఫోన్లో ఉన్న ఎయిర్ కాన్సెప్ట్ స్థానంలో vision pro వంటివి చేర్చడం కారణంగా.. పాత ఆపిల్ ఫోన్ల స్థానంలో కొత్తవి వస్తున్నాయి. కొత్త ఏడాదిలోను కొత్త ఫోన్లు వచ్చే అవకాశాలు ఉన్నందున పాత ఫోన్లో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. అయితే ప్రస్తుతం ఐఫోన్ 17 సిరీస్ పై ఎక్కువగా దృష్టి పెట్టారు. రాను రాను ఇది అప్డేట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని కొందరు అంటున్నారు.