Amazon: ప్రముఖ ఇ కామర్స్ సంస్థ అమెజాన్ అదిరిపోయే ఆఫర్లతో మీ ముందుకు వచ్చేసింది. ‘గ్రేట్ సమ్మర్ సేల్’ పేరుతో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఐఫోన్ 15 నుంచి శాంసంగ్ ఎస్24 అల్ట్రా వరకు.. మీ ఫేవరెట్ మొబైల్‌ను ఇప్పుడు తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? ఈ బంపర్ ఆఫర్ల వివరాలను వివరంగా తెలుసుకుందాం. ‘గ్రేట్ సమ్మర్ సేల్’ పేరుతో భారీ ఆఫర్ల జాతరను ప్రకటించింది. మే 1వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ సేల్ ప్రారంభం కానుంది. ఇక ప్రైమ్ సభ్యులకు అయితే 12 గంటల ముందే, అంటే మే 1వ తేదీ అర్ధరాత్రి నుంచే ఈ ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లపై అమెజాన్ కురిపించబోయే డిస్కౌంట్లు చూస్తే మీరు షాపింగ్ చేయకుండా ఉండేరేమో. యాపిల్, శాంసంగ్, షావోమీ వంటి టాప్ బ్రాండ్ల లేటెస్ట్ మొబైల్స్‌పై భారీ తగ్గింపులు ఉండబోతున్నాయి.
Also Read: ఒకప్పటి అక్కినేని నాగ్ తో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడు ఏమంటుంది అంటే?
స్మార్ట్‌ఫోన్లపై ఊహించని డిస్కౌంట్లు:
* కలలో కూడా ఊహించని ధరలో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 5జీ లభిస్తుంది. దాని అసలు ధర రూ.1,34,999 కాగా, సేల్‌లో కేవలం రూ.84,999కే సొంతం చేసుకోవచ్చు.
* ఐఫోన్ 15 కొనాలనుకుంటున్నారా? దాని అసలు ధర రూ. 69,900 ఉన్న ఈ ఫోన్‌ను ఆఫర్‌లో భాగంగా కేవలం రూ.57,749కే మీ సొంతం చేసుకోవచ్చు.
* వన్ ప్లస్ 13ఆర్ 5జీని కేవలం రూ.39,999కే అందుబాటులో ఉంచనున్నారు.
* అలాగే ఐకూ నియో 10ఆర్ 5జీ అసలు ధర రూ.31,999 కాగా, ఈ సేల్‌లో కేవలం రూ.24,999కే సొంతం చేసుకోవచ్చు.
* షావోమీ 14 సివిని కేవలం రూ.32,999కే, వన్ ప్లస్ నార్డ్ సీఈ4 లైట్ 5జీని కేవలం రూ.15,999కే కొనుగోలు చేయవచ్చు.
ఇక తక్కువ బడ్జెట్‌లో మంచి ఫోన్ కోసం చూసే వాళ్లకు శాంసంగ్ గెలాక్సీ ఎం35 5జీ రూ.13,999, రియల్‌మీ నార్జో 80ఎక్స్ 5జీ రూ.11,999, టెక్నో పాప్9 కేవలం రూ.5,490కే లభించనున్నాయి.
బ్యాంక్ ఆఫర్లు, ఇతర ప్రయోజనాలు
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌లో కేవలం డిస్కౌంట్లు మాత్రమే కాదు. బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఈఎంఐ ట్రాన్సాక్షన్ల పై అదనంగా 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే అమెజాన్ పే- ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుదారులు 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. వీటితోపాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ వంటి సౌకర్యాలు కూడా ఉండనున్నాయి. స్మార్ట్‌ఫోన్లే కాదు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌టీవీలు, ఎయిర్ కండీషన్లపై కూడా భారీ ఆఫర్లు ఉండబోతున్నాయి. సేల్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు మరిన్ని ఆఫర్ల వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.