https://oktelugu.com/

Maruti Cars: 40 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే నయా మారుతి కారు.. ఫీచర్స్ తెలిస్తే దిమ్మదిరుగుద్ది…

దేశీయ కార్ల ఉత్పత్తిలో మారుతి సుజుకీ అగ్రస్థానంలో ఉంది. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన స్విప్ట్ ఎవర్ గ్రీన్ గా నిలిచింది. అత్యధికంగా విక్రయం జరుపుకున్న కారుగా స్విప్ట్ నిలుస్తోంది.

Written By:
  • Srinivas
  • , Updated On : October 27, 2023 / 02:40 AM IST

    Maruti Cars

    Follow us on

    Maruti Cars: కారు కొనాలనుకునేవారు ముందుగా ధర.. ఆ తరువాత మైలేజ్.. చూస్తుంటారు. కొందరు ఫీచర్స్ పై ఫోకస్ పెడుతారు. ఇవన్నీ కలగలిపి ఒకే ఒకే కారులో ఉంటే.. ఎవరైనా దానిని విడిచిపెట్టడానికి ఇష్టపడరు. అలాంటి కారు ఒకటి మార్కెట్లోకి రాబోతుంది. ఇప్పటి వరకు ఎన్నో ఆకర్షణీయమైన మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చిన మారుతి సుజుకీ కంపెనీ తాజాగా అత్యధిక మైలేజ్ ఇచ్చే కారును అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఈ కారు గురించి వివరాలు తెలుసుకున్నవారు షాక్ అవుతున్నారు. ముఖ్యంగా ఫీచర్స్ ను చూసి దిమ్మదిరిగిందని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

    దేశీయ కార్ల ఉత్పత్తిలో మారుతి సుజుకీ అగ్రస్థానంలో ఉంది. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన స్విప్ట్ ఎవర్ గ్రీన్ గా నిలిచింది. అత్యధికంగా విక్రయం జరుపుకున్న కారుగా స్విప్ట్ నిలుస్తోంది. ఆకర్సణీయమైన ధరతో పాటు అద్భుతమైన పీచర్స్ ను ఈ కారు కలిగి ఉంది. అయితే తాజాగా దీనిని అప్డేట్ చేసి ఎక్కువ మైలేజ్ ఇచ్చే దిశగా మార్పులు చేశారు. త్వరలో దీనిని మార్కెట్లోకి తీసుకురాబోతున్నారు. ఇంతకీ ఈ కారు విశేషాలేంటంటే?

    మారుతి సుజుకీ స్విప్ట్ హ్యాచ్ బ్యాక్ గా ఆకట్టుకుంది. దీనికి అదనపు టెక్నాలజీని జోడించారు. హైబ్రిడ్ ఇంజిన్ ను అమర్చారు. అడాస్ షూట్ తో తయారు చేశారు. కొత్త స్విప్ట్ లో డోర్ హ్యాండిల్స్ ఆకర్షణీయంగా ఉంటాయి. బంపర్ కాన్సెప్ట్ ను రీ డిజైన్ చేశారు. ఇందులో 9 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోమెంట్ సిస్టమ్ ఆకర్షిస్తోంది. కొత్త డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, ఎలక్ట్రిక్ సన్ రూప్, వెంటిలేటేడ్ ఫ్రంట్ సీట్లు, 360 డిగ్రీ కెమెరాతో పాటు వైర్ లెస్ ఛార్జీంగ్ సదుపాయం ఉంది.

    లీటర్ పెట్రోల్ కు ఈ కారు 35 నుంచి 40 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే విధంగా ఉత్పత్తి చేవారు. ఇందులో 5 స్పీడ్ మాన్యువల్, 4 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పాటు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంది. ఇంకా డ్యూయల్ టోన్ డ్యాష్ బోర్డ్, ఫ్రీ స్టాండింగ్ వంటి సదుపాయం ఉంది. ప్రస్తుతం దీనిని జపాన్ ఆటో షో లోప్రదర్శించారు. భారత్ లో ప్రవేశపెట్టే విషయాన్ని మాత్రం ఇంకా వెల్లడించలేదు. కానీ ఈ కారు గురించి తెలిసి వినియోగదారులు ఇంప్రెస్ అవుతున్నారు.