https://oktelugu.com/

Hyundai Kona : త్వరపడండి: ఈ ఎలక్ట్రిక్ కారుపై రూ.2 లక్షల తగ్గింపు.. అదీ ఆగస్టు లోపే.. ఏ కారో తెలుసా?

దేశంలో ఆటోమోబైల్ రంగంలో మిగతా కార్లకు గట్టి పోటీ ఇస్తోంది హ్యుందాయ్ కంపెనీ. హ్యాచ్ బ్యాక్ నుంచి ఎస్ యూవీ వరకు అన్ని రకాల మోడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చిన హ్యుందాయ్ ‘కోనా’ పేరుతో ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీని మొదటి తరం కారును 2017లో ఆవిష్కరించారు. ఆ తరువాత 2023లో కొన్ని మార్పులతో చివరి మోడల్ ను ప్రవేశపెట్టారు.

Written By:
  • Srinivas
  • , Updated On : August 5, 2024 / 04:50 PM IST
    Follow us on

    Hyundai Kona : ప్రపంచంలో ఎలక్ట్రిక్ కార్ల హవా పెరిగిపోతుంది.కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా ఈవీల ఉత్పత్తిపైనే దృష్టి పెడుతున్నాయి. చమురు ధరల పెరుగు ధలతో పాటు, వాతావరణ పొల్యూషన్ ను కంట్రోల్ చేయడానికి ఈవీలే బెటర్ అని ప్రభుత్వాలు సైతం చెబుతుండడంతో భారత్ లోనూ చాల కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తాయి. పెట్రోల్, డీజిల్ వాహనాల కంటే వీటి ఖర్చు తక్కువగా ఉండడంతో పాటు వాతావరణంలో ఎలాంటి పొల్యూషన్ ను అందించకుండా ఉంటున్నాయి. దీంతో వినియోగదారులు సైతం ఈవీల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇప్పటికే మార్కెట్లోకి రిలీజ్ అయిన ఈవీల్లో కొన్నింటికి ఆదరణ వస్తున్నాయి. కానీ ఛార్జింగ్ పాయింట్ల సమస్యతో చాలా మంది ఈవీల కొనుగోలుకు ముందుకు రావడం లేదు. పెట్రోల్ బంకులు ఉన్నంత సౌకర్యాంగా ఈవీల ఛార్జింగ్ పాయింట్లు ఎక్కువగా లేకపోవడంతో వీటి కొనుగోలు విషయంలో ఆసక్తి చూపడం లేదు. మరోవైపు కొత్తగా వచ్చే ఎలక్ట్రిక్ కార్ల ధరలు ఎక్కువగా ఉంటున్నాయి. పెట్రోల్ , డీజిల్ కు సంబంధించిన కొన్ని ఎస్ యూవీలు సైతం రూ.10 లక్షల లోపు అందిస్తుండగా.. ఈవీల ధరలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఓ కంపెనీ తన ఎలక్ట్రిక్ కారుపై భారీగా డిస్కౌంట్ ను ప్రకటించింది. ఏకంగా రూ. 2 లక్షల ఆఫర్ ఇవ్వడంతో వినియోగదారులు ఈ కారు కోసం సెర్చ్ చేస్తున్నారు. ఇంత భారీగా డిస్కౌంట్ ప్రకటించిన ఆ కారు ఏది? దాని ధర ఎంత ఉంది? ఆ వివరాల్లోకి వెళితే..

    దేశంలో ఆటోమోబైల్ రంగంలో మిగతా కార్లకు గట్టి పోటీ ఇస్తోంది హ్యుందాయ్ కంపెనీ. హ్యాచ్ బ్యాక్ నుంచి ఎస్ యూవీ వరకు అన్ని రకాల మోడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చిన హ్యుందాయ్ ‘కోనా’ పేరుతో ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీని మొదటి తరం కారును 2017లో ఆవిష్కరించారు. ఆ తరువాత 2023లో కొన్ని మార్పులతో చివరి మోడల్ ను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం మార్కెట్లో 2023 మోడల్ అందుబాటులో ఉంది. ఆ తరువాత దీనిని కొత్తగా మార్చి ఈ ఏడాది చివరి వరకు లాంచ్ చేయడానికి రెడీ అవుతున్నారు. 2023 ‘కోనా’ ఉత్పత్తిని నిలిపివేశారు. ఈ మోడల్ కు సంబంధించి మిగిలిన స్టాక్ ను క్లియర్ చేయాలనుకుంటున్నారు. ఈ తరుణంలో ఈ కారుపై హ్యుందాయ్ కంపెనీ ఏకంగా రూ. 2 లక్షల ఆఫర్ ప్రకటించింది.

    హ్యుందాయ్ కొనా కారులో 7 అంగుళాల ఇన్పోటైన్మెంట్ సిస్టమ్ డిస్ ప్లే ఉంది. ఇందులో ఆటో ఆపిల్ కార్ ప్లే, కనెక్టివిటి సపోర్ట్ ఉన్నాయి. వర్చువల్ సౌండ్ సిస్టమ్ తో పాటు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. డ్రైవర్ అడ్జస్టబుల్ సీట్ తో పాటు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, క్రూయిజ్ కంట్రోల్, వైర్ లెస్ ఫోన్ చార్జింగ్ తో పాటు సన్ రూప్ ఉన్నాయి.

    హయుదా కోనా లో 39 kWబ్యాటరీ ప్యాకప్ ఉంది. ఇది 136 బీహెచ్ పీ పవర్ తో పాటు 395 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 452 కిలోమటర్ల మైలేజ్ ఇస్తుంది. పోర్టబుల్ చార్జర్ తో 19 గంటల్లో ఫుల్ చార్జింగ్ అవుతుంది. ఇందులో 5 సీట్లు ఉన్నాయి. మార్కెట్లో ఉన్న ఎంజీ జెడ్ ఎస్ ఈవీ, బీవైడీ ఏటీ 3 కార్లకు ఇది పోటీ ఇవ్వనుంది. కోనా ను ప్రస్తుతం రూ.23.84 లక్షల ప్రారంభ ధరతో విక్రయించనున్నారు. వీరికి రూ. 2 లక్షల వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నారు. అయితే ఈ ఆఫర్ ఆగస్టు ముగిసే లోపు మాత్రమే ఉంటుందని కంపెనీ తెలిపింది.