Chef Sanjay Thumma: తెలుగు టీవీషోలలో వంటల ప్రోగ్రాంకు ప్రత్యేక స్థానం ఉంది. ఈటీవీ, మా టీవీలు కొన్నేళ్లపాటు ఈ ప్రోగ్రాం కొనసాగించాయి. ఈ కార్యక్రమాలకు బ్రాండెడ్ ఆయిల్, మసాలా తయారీ కంపెనీలు స్పాన్సర్ కూడా చేశాయి. ఇందులో ముగ్గురు నలుగురు తెలుగు వంట మాస్టర్లు పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాంలతో మాస్టర్లకు కూడా ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఇందులో అందరికంటే భిన్నంగా, అందరికీ అర్థమయ్యేలా వంటల గురించి అచ్చమైన తెలంగాణ స్లాంగ్‌తో ఆకట్టుకున్నారు మాస్టర్ సంజయ్ తుమ్మ ఆయన భార్య రాగిణి.
ఫుడ్ లవర్స్‌కు కిక్కించే వంటకాలు..
మనందరికీ భోజనం అంటే చాలా ఇష్టం. ఇటీవల వెరైటీ ఫుడ్ స్టాల్స్ వెలుస్తున్నాయి. అయితే బయటి ఫుడ్ కంటే ఇంట్లో తయారు చేసుకున్న ఫుడ్ ఆరోగ్యం అని వైద్యులు చెబుతుండడంతో చాలా మంది ఇళ్లలోనే వెరైటీలు చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా గృహిణులు అయితే డిఫరెంట్ ఎక్ప్‌పర్‌మెంట్స్ చేస్తున్నారు. ఇందుకోసం టీవీషోలను తెగ చూసేస్తున్నారు. ఇందులో మాస్టర్ సంజయ్ తుమ్మ, ఆయన భార్య రాగిణి షో చాలా మందిని ఆకట్టుకుంది. జంటగా రకరకాల వంటలు చేస్తే.. అందరికీ అర్థమయ్యేలా వివరిస్తూ.. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.
మన హైదరాబాదీనే..
సంజయ్ స్వస్థలం హైదరాబాదీనే. తెలంగాణ బిడ్డే. ఏడేళ్ల వయసు నుంచే వంటలు చేయడం ప్రారంభించాడు. వంటలు చేయడం ఇష్టం లేకపోయినా.. అనుకోని పరిస్థితులతో ఆయన చెఫ్‌గా మారిపోయి.. ఇప్పుడు రెసిపీ సైంటిస్ట్‌గా మారారు. అమ్మ కోసం వంట తయారు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఏడేళ్ల వయసులో సంజయ్ తల్లి ఆనార్యోంతో ఆస్పత్రిపాలైంది. అక్కడ పెట్టే ఆహారం తల్లికి నచ్చకపోవడంతో సంజయ్ ఇంట్లో వంట తయారు చేసి తల్లికోసం ఆస్పత్రికి తీసుకెళ్లేవాడు. ఇలా మొదలైన వంటల ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతోంది. తర్వాత వంటచేయడం హాబీగా మారింది. హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు కూడా చేశాడు. తర్వాత స్టార్ హోటళ్లలో వంటలు చేస్తూ రెస్టారెంట్లు స్థాపించే స్థాయికి ఎదిగాడు.
లోకల్ స్లాంగ్‌లో..
హైదరాబాద్‌కు చెందిన సంజయ్ యూట్యూబ్ చానెల్ కూడా నిర్వహిస్తున్నారు. ఆయన వంటచేసే తీరు చాలా మందికి నచ్చుతుంది. సబ్‌స్క్రైబర్స్ అడిగే ప్రశ్నలకు సంజయ్ సమాధానాలు కూడా చెబుతారు. దీంతో ఈటీవీ, మాటీవీ సంజయ్‌తో వంట ప్రోగ్రాంలు కూడా చేయించాయి. అయితే సంజయ్ కూట్యూబ్‌లో ఎక్కువగా ఇంగ్లిష్, హిందీలో వంటల తయారీ గురించి చెబుతారు. తెలుగు చానెళ్లలో కార్యక్రమాలతో తెలుగులో మాట్లాడాల్సి వచ్చింది. దీంతో పద ప్రయోగంలో ౖహె దరాబాదీ స్లాంగ్ స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో తన భార్య రాగిణితో కలిసి మందు తాగుతూ ఓ వీడియో చేశాడు. తాజాగా తాటి ముంజల గురించి ఓ వీడియో చేశాడు. ఇందులోనూ అవతల పారదెంగాలి.. పీకి పారదొబ్బాలి.. లాంటి పదాలు వాడుతూ తెలంగాణ స్లాంగ్‌ను ఇచ్చి పారేశాడు.