వరల్డ్ వైడ్ ట్విట్టర్ ట్రెండ్ లో మిస్టర్ కూల్: తానొక యూట్యూబ్ సెన్సేషన్, ప్రస్తుత ఉన్న యువతకి పరిచయం లేని పేరు, తాజా గా ఇప్పుడు అందరి నోరుల్లో నానుతున్న బిగ్ బాస్ షో కంటెస్టెంట్ – ఇంక ఎవరో కాదు షణ్ముఖ్ జస్వంత్. సాఫ్ట్‌వేర్ డెవలపర్, సూర్య వెబ్ సీరీస్ ల తో వరుస విజయాలను అందుకుని తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యూట్యూబ్ లో సరికొత్త ట్రెండ్ ని,సెన్సేషన్ ని క్రియేట్ షణ్ముఖ్ జస్వంత్.
బిగ్ బాస్ షో మొత్తానికి హోరా హోరి గా సాగుతుంది. బిగ్ బాస్ లో ఉన్న పది మంది కుటుంబ సభ్యులు టాప్ 5 లో చోటు సంపాదించుకోవడం కోసం పోటా పోటీగా కష్టపడుతున్నారు. అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ నుండి తగినంత పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకోలేకపోతున్నారని ప్రేక్షకుల నుండి విమర్శలు ఎదురవుతున్నాయి.
ఈ తరుణం లో పెద్ద రచ్చే మొదలయ్యి మంచి టీఆర్పీ రేటింగ్ లని అందుకుంటూ ట్రెండింగ్ నిలిచింది. ఇంతలా అవ్వడానికి కారణమే ఏంటంటే షన్ను, సన్నీ ల మధ్య జరిగిన గొడవ. ఎప్పుడు నోరు జారని యూట్యూబ్ సెన్సేషన్ షణ్ముఖ్ జస్వంత్ ఒక్కసారిగా ఫైర్ అయ్యాడు. షన్ను రెచ్చిపోవడానికి కారణమేంటంటే… పదో వారానికి సంబంధించి కెప్టెన్ ఎంచుకోవడానికి కంటెస్టెంట్లకి బీబీ హోటల్ అనే కెప్టెన్సీ టాస్క్ ఇస్తాడు బిగ్ బాస్. ఈ క్రమం లో నోరు జారిన సన్నీ, సిరి అప్పడం లా నలిపేస్తా అని అంటాడు. దానికి షన్ను ఫైర్ అవుతాడు.
అయితే ఈ గొడవ ఇప్పుడు ట్విట్టర్ లో పెద్ద ట్రెండ్ నే సృష్టించింది. సన్నీ అభిమానులు, షన్ను అభిమానులు ట్విట్టర్ లో హాష్ ట్యాగ్ ట్రెండ్ ని మొదలు పెట్టారు. అయితే ఈ ట్విట్టర్ ట్రెండ్ లో #Mr Cool Shannu అనే హాష్ ట్యాగ్ వరల్డ్ వైడ్ ట్విట్టర్ ట్రెండ్ లో నెంబర్ వన్ ప్లేస్ ని సంపాదించింది. షణ్ముఖ్ క్రేజ్ మొన్నటివరకూ యూట్యూబ్ వరకు ఉండేది. ఇప్పుడు ట్విట్టర్ లో కూడా ట్రెండ్ ని సృష్టించారు షణ్ముఖ్ జస్వంత్ అభిమానులు. అయితే ఇంతటి అభిమానాన్ని సంపాదించుకున్న షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ 5 తెలుగు టైటిల్ ని గెలుచుకుంటాడో లేదో చూడాలి.