
Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ గేమ్ షో లో ప్రేక్షకులని అలరించడానికి కచ్చితం గా ఒక ప్రేమ జంట ఉండాల్సిందే. అలా ఈ సీజన్ కి గానూ హమీదా – శ్రీరామా చంద్ర జంట తమ కెమిస్ట్రీ తో జనాలని ఆకట్టుకున్నా… కానీ అనుకోకుండా ఐదో వారంలో హమీదా ఎలిమినేట్ అవ్వడం తో ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేకపోయారు. ఇదంతా పక్కన పెడితే బిగ్ బాస్ హౌస్ లో ఒక వన్ సైడ్ లవ్ స్టోరీ మాత్రం చాలా ఫేమస్ అవుతుంది. తాజా గా ఆ జంట పై అబ్బాయి తల్లి కూడా కొన్ని సంచల కామెంట్స్ చేసింది. ఇప్పుడు దానికి సంబంధించిన వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ అంటే ప్రస్తుతం పరిచయం అక్కర్లేని పేరు. అంతకు ముందు జబర్దస్త్ అనే కామెడీ షో తో అలరించి గుర్తింపు తెచ్చుకున్నది. ఆ తర్వాత బిగ్ బాస్ లో అవకాశం వచ్చాక తన మంచితనంతో, గుడ్ క్యారెక్టర్ తో బోలెడు అభిమానుల్ని సంపాదించుకుంది. అయితే ఒక వర్గం నుండి మంచిపేరు సంపాదించుకున్న ప్రియాంక, ఇంకో వర్గం వైపు నుండి నెగిటివిటీ ని మూట గట్టుకుంటుంది. దానికి ముఖ్య కారణం మానస్ తో నడిపిస్తున్న లవ్ ట్రాక్.
ఇటీవలే ప్రియాంక ‘దేవుడు నాకు మంచి లైఫ్ ఇచ్చి ఉంటే బాగుండేది, నీతో హ్యాపీ గా ఉండేదాన్ని అంటూ’ గుక్కలు పెట్టి ఏడ్చింది. ప్రియాంక ఏడుస్తుంటే మానస్ ఓదార్చిడం సామజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అయితే ఏ విషయం పై మానస్ తల్లి స్పందించింది. ప్రియాంక చాలా మంచి అమ్మాయి అని, తను అంటే చాలా ఇష్టమని చెప్పారు. బిగ్ బాస్ లో ఫ్రెండ్లీ గా ఉండడం అనేది చాలా కామన్ విషయం, ఇదంతా షో వరకే అని తేల్చి చెప్పారు.
బిగ్ బాస్ హౌస్ లో మానస్ కి ఎవరు సెట్ కారు అని షాకింగ్ నిజాన్ని బయట పెట్టారు మానస్ తల్లి పద్మిని. తాను ఎవరిని చూపిస్తే వాళ్లనే మానస్ పెళ్లి చేసుకుంటాడని ధీమా వ్యక్తం చేసింది. అంతే కాకుండా ప్రియాంకా చాలా మంచి అమ్మాయి అని, బయట తనకి నచ్చిన అబ్భాయిని చూసి పెళ్లి చేస్తానని, తనకి సపోర్ట్ చేస్తానని చెప్పింది మానస్ తల్లి పద్మిని.