Bigg Boss 5 Telugu: బుల్లితెరలో దూసుకుపోతున్న నెంబర్ వన్ రియాలిటీ షో బిగ్ బాస్. నాగార్జున వరుసగా మూడోసారి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో విజయవంతంగా 55 రోజుల పూర్తి చేసుకుని ఎనిమిదో వారం చివరకి చేరుకుంది. ఇంకొక 50 రోజులు మిగిలి ఉన్న ఈ షో లో ప్రతి రోజు ఎదొక రచ్చ జరుగుతూనే ఉంటుంది.

నిన్న (శుక్రవారం) జరిగిన ఎపిసోడ్ లో వరస్ట్ పెర్ఫార్మర్ ఎంచుకునే ప్రక్రియ ఆసన్నమైంది. అయితే ఎనిమిదో వారానికి గానూ బిగ్ బాస్ ఇంటి కెప్టెన్ గా యూట్యూబ్ సెన్సేషన్ షణ్ముఖ్ జశ్వంత్ ఎంపికయ్యారు. ఈ తరుణంలో ఇంటి సభ్యుల ఏకాభిప్రాయంతో వరస్ట్ పెర్ఫార్మర్ ని ఎంచుకుని జైలు కి పంపాల్సిందిగా బిగ్ బాస్ కెప్టెన్ షణ్ముఖ్ జశ్వంత్ ని ఆదేశిస్తాడు.
ఈ నేపథ్యంలో ఇంటి సభ్యుల మధ్య పెద్ద వైరమే చోటు చేసుకుంది. ఈ వారం మొత్తానికి గాను వరస్ట్ పర్ఫార్మెన్స్ కనబరిచింది ఎవరు అనే విషయం మీద ఇంత రచ్చ చెయ్యడం అవసరమా అని నిన్న జరిగిన ఎపిసోడ్ నే చూస్తూనే అర్థమవుతుంది. గేమ్ లో ఓడిపోయినందుకు ప్రతి ఒక్కరికి బాధ వుంటుంది. అది సహజమే. ఒకవేళ గేమ్ బాగా ఆడిన… అన్యాయం చేసి తన కి రావాల్సిన కెప్టెన్ పదవి వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగితే కోపం రావడం కూడా సహజమే… కానీ, విచక్షణ కోల్పోయి నోరు ఉంది కదా.. ఇష్టం వచ్చినట్టు వాగితే .. చూసే ప్రతీ ఒక్క ప్రేక్షకుడి కి అయిష్టం కలుగుతుంది. నిన్న జరిగిన ఎపిసోడ్ లో సన్నీ విషయం లో కూడా ఇదే జరిగింది.
Also Read: Puneeth raj kumar Video: జిమ్ లో పునీత్ రాజ్ కుమార్ గుండెపోటు వీడియో.. నిజమెంత?
“తన కోపమే తన శత్రువు” అన్నట్టు గానే సన్నీ కోపమే తన శత్రువు లా మారిపోయింది. హౌస్ మేట్స్ అంతా ఒకేవైపు… సన్నీ, మానస్, కాజల్ ఒకవైపు అన్న పరిస్థితి నెలకొంది. అదే సన్నీ కొంప ముంచింది. ఎనిమిదో వారానికి గానూ మళ్ళీ వరస్ట్ పెర్ఫార్మర్ గా పరిగణించబడి రెండో సారి జైలు కి వెళ్ళాడు. అంతకు ముందు కూడా ఒకసారి వెళ్లిన సన్నీ మళ్లీ జైలు కి వెళ్ళడం తో … తన స్నేహితుడు అయిన మానస్ బాగా అప్సెట్ అయ్యాడు. అప్పుడు కూడా వాళ్ళు ఉన్నపుడు, ఇప్పుడు కూడా వాళ్ళు ఉన్నప్పుడే మళ్ళీ ఎల్లావు అంటూ త్రిమూర్తులు (షన్ను, సిరి, జెస్సీ) ని ఉద్దేశించి అన్నాడు. మరి ఈ వారం జరిగిన రచ్చ రంబోలా లో తప్పొప్పులు ఎవరివి అన్న విషయం శనివారం జరిగే ఎపిసోడ్ లో నాగార్జున వెల్లడిస్తాడు. మరి ఇవ్వాళ (శనివారం) జరిగే ఎపిసోడ్ లో ఏం జరుగోతోంది అనే విషయం తెలుసుకోవాలంటే రాత్రి ప్రసారమయ్యే ఎపిసోడ్ వరకి ఎదురు చూడాల్సిందే.
Also Read: Avika ghor: చిన్నారి పెళ్లి కూతురు జీవితాన్ని నాశనం చేసింది ఎవరు?