Bigg Boss 5 Telugu: తనదైన మాట తీరుతో, ఆట తీరుతో అందరిని మంత్రం ముగ్దల్ని చెయ్యడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకుంది హమీదా. ఉన్నది ఉన్నట్టు, సూటిగా సుత్తిలేకుండా… నిజాలని నిక్కచ్చిగ్గా కుండబద్దలు పగలకొట్టేట్టు మాట్లాడే హమీదా ఐదో వారానికే ఎలిమినేట్ అయ్యింది. సామజిక మాధ్యమాల్లో సరైన ఫ్యాన్ బేస్ లేకపోవడమే హమీదా ఎలిమినేట్ అవ్వదానికి ప్రధాన కారణం అని అంటున్నారు ఇతర వర్గాలు. బిగ్ బాస్ లో అతి ముఖ్యమైన వాటిల్లో ఒకటి లవ్ ట్రాక్. శ్రీరామ చంద్ర తో లవ్ ట్రాక్ నడిపించి, కావలిసినంత స్క్రీన్ స్పేస్ సంపాదించినా సరే… ఎలిమినేషన్ నుండి మాత్రం తప్పించుకోలేకపోయింది హమీదా.

ప్రతి వారం వారం ఏదో ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వక తప్పదు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు అనే విషయం మీద ఎప్పుడు ఆసక్తి ఉంటుంది ప్రేక్షకుల్లో. కావాల్సిన దానికంటే ఎక్కువగా అందాలు ఆరబోస్తూ, లవ్ ట్రాక్ లు నడిపిస్తూ, సందడి సందడి చేసి బిగ్ బాస్ కి మంచి రేటింగ్ వచ్చేలా చేసింది ఈ బ్యూటీ. మరి అలాంటి ముద్దుగుమ్మకి మంచి పారితోషకమే ముట్టజెప్పారు బిగ్ బాస్ యాజమాన్యం.
అయితే హమీదా ఒక్క వారానికిగానూ 80 వేల నుంచి లక్ష రూపాయల మేర రెమ్యునరేషన్ అందుకున్నట్లు జోరుగా సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఈ లెక్కన ఆమె ఐదువారాలకుగానూ నాలుగున్నర లక్షల పై చిలుకే వెనకేసుకుంది. కాగా గతవారం ఎలిమినేట్ అయిన నటరాజ్ మాస్టర్ కూడా వారానికి లక్ష అందుకున్నట్లు కథనాలు వెలువడిన విషయం తెలిసిందే! ఇక బిగ్‌బాస్ హౌస్‌కు గ్లామర్ అద్దడానికి హమీదా ఎంతగానో ఉపయోగపడింది కాబట్టి ఆమెకు లక్షకు పైనే ఇచ్చినా తప్పు లేదంటున్నారు బుల్లితెర అభిమానులు.