Bigg Boss 5 Telugu: ప్రతి వారం లాగ ఈ వారం కూడా నామినేషన్స్ తర్వాతి రోజు కూడా రచ్చ కొనసాగుతూనే ఉంది. మొత్తానికి ఐదు వారాలు పూర్తి చేసుకుని ఆరోవారానికి చేరుకుంది బిగ్ బాస్. ఆరో వారానికి గాను బిగ్ బాస్ ఇంటి నుండి బయటకి వెళ్ళడానికి జరిగే నామినేషన్ల ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. ఇక మిగిలి ఉన్నది కెప్టెన్సీ కంటెండర్ల టాస్క్. దానికి సంబందించిన బిగ్ బాస్ బొమ్మల ఫ్యాక్టరీ అనే కెప్టెన్సీ కంటెండర్ల టాస్క్ నిన్న(మంగళవారం) మొదలయింది.

ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ఇంటి సభ్యులని నాలుగు టీమ్స్ గా విభజిస్తాడు. ఎల్లో టీం లో జెస్సి, షణ్ముఖ్, ప్రియాంక సింగ్…… గ్రీన్ టీం లో రవి, లోబో, శ్వేతా వర్మ….. బ్లూ టీం లో అని మాస్టర్, మానస్, సన్నీ…… రెడ్ టీం లో శ్రీరామ చంద్ర, ప్రియా, విశ్వ ఉన్నారు. కాజల్, సిరి సంచాలకులుగా వ్యవహరించనున్నారు.
చిచ్చు పెట్టిన బిగ్ బాస్ – టీమ్స్ ని ఎంపిక చేసిన విధానమే తెలుస్తుంది బిగ్ బాస్ ఏ రేంజ్ లో చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నాడో అని. ప్రియాంక, షన్ను కి ఎక్కువ గా కనెక్షన్ లేదు కాబట్టే ఒకే టీం లో వేసాడు. అని మాస్టర్, శ్వేతా వర్మ ల మధ్య మంచి అమ్మ – కూతురు అనే సంబంధం ఉంది. కాబట్టి ఆట పరంగా అని మాస్టర్, శ్వేతా వర్మ ల మధ్య చిచ్చు పెట్టేందుకే వేరే వేరే టీం లో వేసాడు బిగ్ బాస్. సిరిని, కాజల్ ని సంచాలకులుగా పెట్టడం వెనుక కూడా పెద్ద కుట్రనే దాగి ఉంది. ఎందుకంటే సిరి కి షణ్ముఖ్, జెస్సీ మంచి మిత్రులు. ముగ్గురిని త్రిమూర్తులు అని పిలవడం కూడా మొదలు పెట్టారు. ఏదొక విధంగా షన్ను టీం వాళ్లకి సిరి మద్దతు ఇవ్వడానికి ప్రయత్నం చేసి గెలిపించేలా చేస్తుంది.
ఇలా కొత్త కనెక్షన్లు పెట్టి ఒకరి మద్య ఒకరికి ఆట పరంగా గొడవలు పెట్టడం లో బిగ్ బాస్ సఫలీకృతుడయ్యాడనే చెప్పొచ్చు. అలా అని మాస్టర్, సిరి,శ్వేతా వర్మల ల మధ్య పెద్ద చిచ్చే రేపి ప్రేక్షకులకి మంచి వినోదాన్ని పంచిపెడుతున్నాడు బిగ్ బాస్.