
జగన్ ప్రభుత్వ అవినీతిపై పార్టీ కార్యకర్తలతో సర్వే చేయిస్తామని ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ అమరావతి రైతులకు టీడీపీ, వైసీపీలు అన్యాయం చేస్తున్నాయన్నారు. చంద్రబాబు హయాంలో రైతులకు ఏం చేశారని ఇప్పుడు ఆందోళన చెందుతున్నారన్నారు. అలాగే అమరావతిలో జగన్ ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై తమ పార్టీ కార్యకర్తలతో సర్వే చేయిస్తామన్నారు. అమరావతిలో 64వేల ప్లాట్లు రైతులకు ఇవ్వాలని, 9 వేల ఎకరాలు అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.