
అమెరికాలో జరుగుతున్న ఎన్నికల్లో తెలుగువారు సత్తా చాటుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏడుకొండలు కౌన్సిల్‌గా ఎన్నికయ్యారు. కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఫోల్సమ్ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాకు చెందిన ఏడుకొండలు విజయం సాధించడంతో అమెరికాలోని తెలుగువారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా విడవలూరు గిరిజన కుటుంబానికి చెందిన ఏడుకొండలు ఇంటర్ వరకు ఇక్కడే చదువుకున్నారు. సివిల్స్‌రాసిన ఆయన ఐఈఎస్ అధికారిగా ఎంపికయ్యాడు. ఆ తరువాత సింగపూర్, అనంతరం అమెరికా వెళ్లి సిర్థపడ్డారు. అవుతార్ ఐటీ సొల్యూషన్ స్థాపించి సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.