
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. లావేరు మండలం తాళ్ల వలస దగ్గర గురువారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో కర్రి మాధవరావు, నెల్లిమర్ల ఢిల్లీరావులు మృతి చెందారు. సొంపేట నుంచి విశాఖకు వెళ్తున్న వీరి కారు తాళ్లవలస దగ్గర ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తిగా గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు.