
టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి దర్శనం విషయంలో నిబంధనలను టీటీడీ తొలగించింది. 10 ఏళ్ల లోపు చిన్నారులు, 65 ఏళ్ల పైబడి వృద్ధులకు దర్శనానికి అనుమతిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. భక్తుల విజ్ఞప్తుల నేపథ్యంలో ఆంక్షలను రద్దు చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ అధికారులు చెబుతున్నారు. స్వీయ నియంత్రణ, జాగ్రత్తలతో దర్శనం చేసుకోవచ్చని టీటీడీ పేర్కొంది. వృద్ధులకు, పిల్లలకు ప్రత్యేక క్యూ లైన్ల సౌకర్యం లేదని అధికారులు తెలిపారు. కరోనా ఆంక్షలు నేపథ్యంలో 65ఏళ్ల పైబడిన వృద్ధులతో పాటు 10ఏళ్ల లోపు చిన్నారులను గత కొద్దీ నెలలుగా శ్రీవారి దర్శనానికి టీటీడీ అనుమతించలేదు. కరోనా రాష్ట్రంలో తీవ్రంగా ఉన్న సమయంలో శ్రీవారి దర్శనానికి టీటీడీ పలు ఆంక్షలు విధించింది. అయితే కరోనా ప్రభావం ఏపీలో తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే గతంలో ఉన్న ఆంక్షలను సడలిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.