
రామతీర్థంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రామతీర్థం కొండపైకి ర్యాలీగా వెళ్లేందుకు బీజేపీ నేతలు యత్నిస్తున్నారు. అయితే నెల్లిమర్లలో బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి కేజీహెచ్‌కు తరలించారు. పోలీసులు తనపై దాడి చేశారని.. వారి తీరు సరిగా లేదన్నారు. ఈ ఘటనపై విష్ణువర్ధన్‌రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఫోన్ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు అత్యుత్సాహం చూపారని విష్ణువర్ధన్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌తో మాట్లాడతానని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.