
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై విపక్షాలు అందరినీ మభ్యపెడుతున్నాయని ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. గుంటూరు జిల్లా పెదవడ్లపూడిలో నిర్వహించిన భాజపా రైతు సాధికార సదస్సులో ఆ పార్టీ ఎంపీ జీవీఎల్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ కొత్త చట్టాల విషయంలో రైతులు ఐదు అంశాలపై ఉద్యమిస్తున్నారని చెప్పారు. పంటలకు కనీస మద్దతు ధర కొనసాగుతుందన్నారు. వ్యవసాయ మార్కెట్లు మూతపడతాయనే ప్రచారం అపోహ మాత్రమేనని చెప్పారు. రైతుల భూములకు ఎలాంటి ఇబ్బందీ ఉండదన్నారు. రైతులకు నిర్దేశించిన ధరను గడువులోగా చెల్లించపోతే జరిమానా విధిస్తారని వీర్రాజు వివరించారు.