
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఆంక్షలు కఠినతరం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. లా అండ్ ఆర్డర్ తో పా 144 సెక్షన్, 30 యాక్ట్ అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఆంక్షలు జనవరి 31 వరకు కొనసాగుతాయని తెలిపారు. ఎవరైనా సరే గుంపులు గుంపులుగా ఉండడం, సమావేశాలు నిర్వహించడంపై నిషేధం విధించామని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. కాగా గతంలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కేతిరెడ్డి మధ్య విభేదాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.