
ప్రభుత్వ భూములు ఎవరు ఆక్రమించినా కఠిన చర్యలు తప్పవని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి అని.. ప్రజాస్వామ్యంలో అందరూ సమానమేనన్నారు. ఈ విషయంలో తెదేపా నేతలు తప్పుడు ప్రచారాలు చేయవద్దన్నారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. విశాఖ జిల్లాలో బాక్సైట్ తవ్వకాలను అనుమతించబోమని స్పష్టం చేశారు. ఒడిశా నుంచి బాక్సైట్ తెచ్చి అన్‌రాక్ పరిశ్రమ నడిపే యోచనలో ఉన్నామని.. దీని వల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.