
సీఎం జగన్‌పై మరోసారి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘విజయనగరం జిల్లా రామతీర్థంలో రాముడి విగ్రహం తల నరికి తీసుకువెళ్లిన ఘటన చాలా దారుణం. మీ ప్రభుత్వంలో ఈ ఘటనకు ముఖ్యమంత్రిగా మీకు సిగ్గు అనిపించడం లేదా? జీసస్ విగ్రహం తల నరికి ఎవరైనా తీసుకువెళితే క్షణాల్లో పట్టుకుంటారు. హిందూ దేవుళ్ళ విగ్రహాలను ధ్వంసం చేసినా.. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని నేరస్తులను పట్టుకోవడం లేదు. సీఎం గారు మీకు హిందువులంటే అంత చులకనా? హిందూ ఆలయాలపై దాడులు చేసేవారిని తక్షణం పట్టుకునే విధంగా పోలీసు శాఖకు ఆదేశాలు ఇవ్వండి. ఈ ప్రభుత్వంలో వరుస సంఘటనలు హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నాయి. ఇప్పటికైనా స్పందించి దయచేసి కఠిన చర్యలు తీసుకోండి’ అని రఘురామకృష్ణరాజు కోరారు.