
ఆంధ్రప్రదేశ్‌లో బీసీ కార్పొరేషన్‌లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 56 బీసీ కులాల కార్పొరేషన్లు 139 బీసీ కులాలకు ప్రాతినిథ్యం వహిస్తాయని ప్రభుత్వం తెలిపింది. బీసీలకు పథకాలు వేగంగా అందించేందకు ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేసినట్లు ప్రకటనలో తెలిపింది. ఈనెల 18న ఆయా కులాల వారీగా కార్పొరేషన్లకు చైర్మన్లను, డైరెక్టర్లను నియమించే అవకాశం ఉంది. ఏపీ సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం 2001 ప్రకారం బీసీ కులాల కార్పొరేషన్ల ఏర్పాటు చేసినట్లు ప్రబుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.