
ప్రజలంతా స్థానికంగా తయారైన వస్తువులను నిత్య జీవితంలో వాడుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆత్మనిర్భర్ భారత్ పథకంలో భాగంగా స్థానిక, స్వదేశీ పరిశ్రమలను ప్రోత్సహించాలన్నారు. ప్రతి నెలా దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడే రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’లో ఆదివారం మోదీ మాట్లాడుతూ, విశాఖ పట్నం నగరవాసి వేంకట మురళీ ప్రసాద్ తీసుకుంటున్న చొరవను ప్రశంసించారు. వేంకట మురళీ ప్రసాద్ తన ఇంట్లో ప్రతి రోజూ ఉపయోగించే వస్తువుల జాబితాను తయారు చేశారని, 2021లో సాధ్యమైనంత వరకు భారత దేశంలో తయారైనవాటినే ఉపయోగించాలని నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పారని మోదీ తెలిపారు.