
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు గురువారం ఉదయం ఇడుపులపాయంలో కలుసుకున్నారు. నేడు పులివెందుల్లో పలు అభివృద్ధి పనులకు సీఎం శంఖుస్థాపన చేయనున్నారు. పులివెందుల్లో సుమారు రూ.6 వేల కోట్ల అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంఖుస్థాపనలు చేయనున్నారు. నిన్న పులివెందులకు వచ్చిన జగన్ మూడు రోజుల పాటు అక్కడే పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. 25న క్రిస్మస్ వేడుకలను కుటుంబసభ్యులతో కలిసి జరుపుకోనున్నారు.