
విశాఖలోని శిల్పారామమ్ లో ఏర్పాటు చేసిన అల్ ఇండియా హ్యాండ్లూమ్ క్రాఫ్ట్స్ మేళాను సచివాలయం నుంచి వర్చువల్ గా ప్రారంభించారు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో ఈ తరహా క్రాఫ్ట్స్ మేళాలు మరిన్ని ఏర్పాటు చేస్తాం అని తెలిపారు. చేనేత కళాకారులను ఆదుకునేందుకు, ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. విశాఖలో ని క్రాఫ్ట్స్ మేళాకు వివిధ రాష్ట్రాల నుంచి కళాకారులు తమ ఉత్పత్తులు ప్రదర్శనకు పెట్టారు అని పేర్కొన్నారు.