
కుటుంబ కలహాలతో ఇద్దరు మహిళల దారుణహత్య జరిగిన సంఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని నాలుగోమైలులోని నవలాకులతోటలో నిర్మలమ్మ, రమణమ్మ అనే మహిళలు నిర్మలమ్మ భర్త చేతిలో హత్యకు గురైనట్లు తెలుస్తోంది. స్థానికులు పోలీసులుకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా హత్య చేసిన వ్యక్తి అక్కడి నుంచి పారిపోయినట్లు సమాచారం. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుందని స్థానికులు చర్చించుకుంటున్నారు.